మరీ దారుణమైపొతున్నారే.. అభాసుపాలే కదా?
విమర్శలు వ్యక్తిగతమవుతున్నాయి. అంతకు మించి మనవత్వాన్ని పరిహసిస్తున్నాయి. విశాఖలో జరిగింది ముమ్మాటికీ దారుణమే. నిద్రపోతున్న వారిని చావు దాకా తీసుకెళ్ళిన విషయ వాయువు దుర్ఘటన ప్రతి ఒక్కరినీ [more]
విమర్శలు వ్యక్తిగతమవుతున్నాయి. అంతకు మించి మనవత్వాన్ని పరిహసిస్తున్నాయి. విశాఖలో జరిగింది ముమ్మాటికీ దారుణమే. నిద్రపోతున్న వారిని చావు దాకా తీసుకెళ్ళిన విషయ వాయువు దుర్ఘటన ప్రతి ఒక్కరినీ [more]
విమర్శలు వ్యక్తిగతమవుతున్నాయి. అంతకు మించి మనవత్వాన్ని పరిహసిస్తున్నాయి. విశాఖలో జరిగింది ముమ్మాటికీ దారుణమే. నిద్రపోతున్న వారిని చావు దాకా తీసుకెళ్ళిన విషయ వాయువు దుర్ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసేదే. మరి పన్నెండు మంది చనిపోయారు. మరణించిన వారిని ఎవరూ తిరిగి తేలేరు. కానీ వారి జీవితం గడవడానికి ప్రభుత్వం గతంలో ఎవరూ ఇవ్వనంత నష్టపరిహారం ప్రకటించింది. కోటి రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడమే కాదు, వారికి అందచేసారు కూడా. దీని మీద ఇపుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలే ఇంకా దారుణంగా ఉన్నాయి. నష్టపరిహారం ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని చంద్రబాబు అంటే ఆయన కంటే మరో అడుగు ముండుకేసిన కుమారుడు, రాజకీయ వారసుడు నారా లోకేష్ మంత్రులను చనిపోమంటున్నాడు. వారి కుటుంబాలకు కోటి నష్టపరిహారం ఇస్తే సరిపోతుందా అని సవాల్ చేస్తున్నాడు.
బాబు ఇచ్సినపుడో….
మరి ప్రమాదాలు ఎపుడూ చెప్పి రావు. అది ఏ ప్రభుత్వం అయినా కూడా జరిగేవి జరుగుతూ ఉంటాయి. అ వెంటనే ప్రతిపక్షాలు డిమాండ్ చేసేది పోయిన ప్రాణాలను తిరిగి ఇమ్మని కాదు, నష్ట పరిహారాన్నే. ఇపుడు గ్యాస్ దుర్ఘటన విషయంలోనూ తెలుగుదేశం పాతిక లక్షల రూపాయలు పరిహారం డిమాండ్ చేసింది. కానీ ఎవరూ అనుకోని సాయాన్ని జగన్ ప్రకటించడంతో ఇపుడు పసుపు పార్టీ రూటు మార్చి ప్రాణాలు తెమ్మంటోంది. మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన గోదావరి పుష్కరాల దారుణంలో 29 మంది చనిపోయారు. వారికి కూడా నష్టపరిహారం ప్రకటించారు. మరి వారి ప్రాణాలను బాబు ప్రభుత్వం వెనక్కి తెగలిగిందా. ఇలా దేశంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి , ప్రాణాలు ఇవ్వకుండా నష్టపరిహారం ఇవ్వడం తప్పు అని నారా లోకేష్ అనగలరా?
చావుల దాకానా….?
విమర్శలు ఉండవచ్చు కానీ చావుల దాకా కధ నడిపించడం ఎందుకు. మంత్రులు చావాలని కోరుకోవడం రాజకీయం అనిపించుకుంటుందా? నారా వారి అబ్బాయి రాను రాను శృతి మించి చేస్తున్నారా విమర్శలు అనిపిస్తున్నాయి. ఆయన దూకుడుగా మాట్లాడాలని అనుకుని ఇలా బోల్తా పడుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. నిజానికి పరిహారం ఎపుడు పరిష్కారం కాదు, ప్రజలను ప్రమాదాల నుంచి రక్షించడానికి ఇతర మార్గాలు వెతకాలి. అలా సూచనలు చేయాలి. అంతేతప్ప వ్యక్తిగత విమర్శలు ఎవరికీ శోభని ఇవ్వవు. ఈ సంగతి జూనియర్ బాబు నారా లోకేష్ గ్రహిస్తే మంచిదేమో
అలా చేయాలట ….
ఇక పీసీసీ చీఫ్ శైలజానాద్ సైతం ఇలాగే మాట్లాడుతున్నారు. బాధిత గ్రామాల్లో మంత్రులు బస చేయకూడదట. ఏకంగా విషవాయువు ఉన్న కర్మాగారంలో పక్క వేసుకుని పడుకోవాలట. మరి ఇంత కక్షపూరిత విమర్శలు చేయడం వల్ల జనాలకు ఏ రకమైన సందేశం ఇద్దామనుకుంటున్నారో నేతలకే తెలియాలి. ఇది ఒక పరిశ్రమలో జరిగిన నిర్లక్ష్యం. ప్రభుత్వం తప్పు చేస్తే కూడా విమర్శలు చేయవచ్చు. దేశం మొత్తం మీద ఇలాంటి రసాయన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. ప్రమాదాలు ఇవాళ ఒక్కటే జరగలేదు. ముందు జరగదని గ్యారంటీ కూడా లేదు. అందువల్ల నిర్మాణాత్మకమైన సలహా సూచనలు ఈ సమయంలో ఇవ్వాలి. అంతేతప్ప నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకుంటే జనాల్లో పలుచన కావడం తప్ప ప్రయోజనం లేదు. మరి ఈ విషయంలో తప్పులు జరిగితే అందరూ బాధ్యులే అవుతారు. వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు చేయాలనుకుంటే అసలు లక్ష్యం నేరవేరకపోగా బాధితులకు అన్యాయం జరుగుతుంది, ఏది ఏమైనా రాజకీయాల్లో ఉన్న వారు మాటలను జాగ్రత్తగా వాడడం మంచిదేమో.