కుర్ర కుమార వేషాలేగా
కచ్చితంగా చెప్పాలంటే నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి అయిదేళ్ళు మాత్రమే అయిందనుకోవాలి. 2014 ఎన్నికల వేళ తెర ముందుకు వెనక్కు తిరిగిన నారా లోకేష్ 2017లో ఉగాది [more]
కచ్చితంగా చెప్పాలంటే నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి అయిదేళ్ళు మాత్రమే అయిందనుకోవాలి. 2014 ఎన్నికల వేళ తెర ముందుకు వెనక్కు తిరిగిన నారా లోకేష్ 2017లో ఉగాది [more]
కచ్చితంగా చెప్పాలంటే నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి అయిదేళ్ళు మాత్రమే అయిందనుకోవాలి. 2014 ఎన్నికల వేళ తెర ముందుకు వెనక్కు తిరిగిన నారా లోకేష్ 2017లో ఉగాది నాడు ముహూర్తం చూసుకుని మరీ మంత్రి అయ్యారు. అంటే ఫుల్ టైం పాలిటిక్స్ అలా మొదలైందన్న మాట. ఏ విధంగా చూసినా నారా లోకేష్ పొలిటికల్ లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఆయన ఇంకా ఎంతో దూరం పయనించాలి. రాజకీయాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అయితే నారా లోకేష్ మాత్రం మాట్లాడితే చాలు రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాళ్లు చేస్తున్నారు. అది ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచి అంటున్న మాటలే. చేస్తున్న భారీ ప్రకటనలే. రాజకీయ జీవితంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. ఇపుడున్న రోజుల్లో అయితే అరోపణలే ఆయుధాలుగా మారుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే రాజకీయం వచ్చేసింది. మరి ప్రతి చిన్న దానికీ రాజీనామా…. రాజకీయ సన్యాసం అంటూ నారా లోకేష్ విన్యాసాలు చేయడమే పెద్ద చర్చగా ఉంది.
పెద్దాయనకే గురి…..
నారా లోకేష్ పుట్టకముందే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అన్న గారి పార్టీలో 1983లో చేరి జనవరిలో ఏర్పాటైన ప్రభుత్వంలో సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తరువాత మార్చిలో నారా లోకేష్ పుట్టారు. మరి తమ్మినేని ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎదురులేకుండా గెలవడమే కాదు, ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించారు. పార్టీ బాధ్యతలు మోశారు. రాజకీయంగా విశేష అనుభవం ఉన్న వారు. ప్రస్తుతం స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. తమ్మినేని ఓ విధంగా బాబు సరసన ఉన్న పెద్ద నాయకుడు, నారా లోకేష్ కి పితృ సమానుడు. మరి అటువంటి తమ్మినేని మీద నారా లోకేష్ కామెంట్స్ చేయడం నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, మీరు తప్పు చేస్తే ఏం చేస్తారూ అంటూ నిలదీయడం పిల్ల చేష్టలుగానే భావిస్తున్నారు. తమ్మినేని నారా లోకేష్ మీద ఆరోపణలు చేస్తే ఆయన వేరే విధంగా జవాబు చెప్పవచ్చు కానీ గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా రాజకీయాల నుంచి తప్పుకోవడాలు వంటిని తీసుకురావడం అంటే ఇది కుర్ర కుమారం వేషాలుగానే చూడాలని అంటున్నారు.
అదే పనిగా….
గతంలోనూ నారా లోకేష్ బహిరంగ లేఖలు రాస్తూ అనేక సవాళ్ళు చేశారు. జగన్ మీద కూడా ఆయన ఆరోపణలు నిరూపించకపోతే తప్పుకుంటారా? అంటూ నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆరోపణ వస్తే దాన్ని తప్పు అని చెప్పాలి. అంతే కానీ రాజకీయం చేయాలని చూడడం, భారీ స్టేట్మెంట్లతో సంచలనాలు నమోదు చేయడం వటి వాటి వల్ల సాధించేది ఏదీ ఉండదని అంటున్నారు. నిజానికి రాజకీయాల నుంచి తప్పుకుంటాన్న మాట ఎపుడూ చంద్రబాబు నోటి వెంట రాదు, ఆయన నలభయ్యేళ్ళ రాజకీయ జీవితం చూశారు. ఎన్నో నిందలు, నిష్టూరాలూ మోశారు, కానీ ఆయన పదునైన మాటలతోనే తిప్పికొడతారు తప్ప రాజీనామాలు, రాజకీయ సన్యాసాలు బాబు డిక్షనరీలోనే అసలు లేవు. మరి ఆ తండ్రి రాజకీయ వారసుడిగా నారా లోకేష్ ప్రతీ దానికి ఉలికిపడుతూ తప్పుకుంటానని అంటే నిజంగానే కొంప ముంచే ప్రమాదం అంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ప్రజలు ఓడించారు. ఇలాంటి ప్రకటనలతో ఉన్న ఎమ్మెల్సీకి రాజీనామా అంటే పూర్తిగా ఇబ్బందే అంటూ సైటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు.