లోకేష్ కి దేవుడు కనిపించేలా చేసిన జగన్ …?
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నాటి విపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచు చెప్పిన మాట ఒకటే. బాబు చేసిన తప్పులకు పైన దేవుడు [more]
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నాటి విపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచు చెప్పిన మాట ఒకటే. బాబు చేసిన తప్పులకు పైన దేవుడు [more]
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నాటి విపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచు చెప్పిన మాట ఒకటే. బాబు చేసిన తప్పులకు పైన దేవుడు వున్నాడు తగిన శిక్ష విధిస్తాడు. దీన్ని ప్రత్యర్ధులు ఆయన క్రిస్టియన్ కాబట్టి పదేపదే అంటున్నారని ఆ మత ప్రచారం కోసమే అయన అలా పలవరిస్తాడని ఎద్దేవా చేసేవారు టిడిపి బృందం. ఆ విమర్శలను మాత్రం జగన్ లైట్ తీసుకున్నారు. ఆ తరువాత జగన్ కష్టం వైసిపి అదృష్టం కలిసొచ్చి సర్కార్ అధికారంలోకి వచ్చేసింది. ఇలా నాడు జగన్ కి చంద్రబాబు దేవుడు కనిపించే అంత కష్టాలను నాడు సృష్ట్టించారని అందరిలో చర్చించుకునేవారు.
ఇప్పుడు లోకేష్ వంతు వచ్చింది …
ఎప్పుడు దేవుడు మాట ఎత్తని నారా లోకేష్ కి ఇప్పుడు ఆయన గుర్తొచ్చేశారు. వైఎస్ జగన్ వ్యూహాలకు టిడిపి నేతలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరు జైళ్ళకు వెళతారు ? ఎవరు ఏ కేసుల్లో ఇరుక్కుంటారో కూడా అయోమయంలో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు రా బాబు అనుకున్నవారు అధికారపార్టీ ఫ్యాన్ కింద సేద తీరేందుకు క్యూ కట్టేస్తున్నారు. ఇది తెలుగుదేశానికి ఇరకాట పరిస్థితి ని కల్పించింది. దాంతో ప్రస్తుతం సైకిల్ కి మరమ్మత్తు బాధ్యతలు నెత్తిన పెట్టుకున్న నారా లోకేష్ ప్రధాన లీడర్ లు చేజారిపోకుండా వారికి, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు బాబు డైరెక్షన్ లో రంగంలోకి దిగారు.
మార్పు కాలం ఇచ్చిన తీర్పే …
ఈ సందర్భంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయం అవుతున్నాయి. పైన దేవుడు ఉన్నాడు. ఇంతకు ఇంతా వడ్డీ తో సహా బదులు తీర్చుకుంటామంటూ అచ్చన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించే సందర్భంలో పేర్కొన్నారు. జావగారిపోతున్న పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే క్రమంలో చినబాబు నిర్వేదం వ్యక్తం చేయడం దేవుడిపై భారం వేయడం చూస్తుంటే జగన్ సర్కార్ పాత పగలు చల్లారినట్లో లేదో రాబోయే రోజుల్లో చూడాలి. మొత్తానికి మాత్రం నాడు బాబు జగన్ కి దేవుడిని తలుచుకునేలా చేస్తే నేడు అదే పరిస్థితి ప్రత్యర్థి లోకేష్ కి దేవుడు గుర్తొచ్చేలా చేసేసారు. మార్పు కాలం ఇచ్చే తీర్పు అంటే ఇదేనేమో..