లోకేష్ మారాడు.. వీళ్లు మాత్రం మారరా..?
రాజకీయాలలో మార్పు అవసరం. ప్రజలు ఎలాంటి నేతలను కోరుకుంటున్నారు. ఎలాంటి మార్పులను వారు ఆహ్వానిస్తున్నారు. ఎలా ఉంటే.. ప్రజాదరణ పెరుగుతుంది.. అనే విషయాలపై నాయకులు, రాజకీయ పార్టీలూ [more]
రాజకీయాలలో మార్పు అవసరం. ప్రజలు ఎలాంటి నేతలను కోరుకుంటున్నారు. ఎలాంటి మార్పులను వారు ఆహ్వానిస్తున్నారు. ఎలా ఉంటే.. ప్రజాదరణ పెరుగుతుంది.. అనే విషయాలపై నాయకులు, రాజకీయ పార్టీలూ [more]
రాజకీయాలలో మార్పు అవసరం. ప్రజలు ఎలాంటి నేతలను కోరుకుంటున్నారు. ఎలాంటి మార్పులను వారు ఆహ్వానిస్తున్నారు. ఎలా ఉంటే.. ప్రజాదరణ పెరుగుతుంది.. అనే విషయాలపై నాయకులు, రాజకీయ పార్టీలూ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంటాయి. ప్రజల నాడికి అనుగుణంగా.. ఓటు బ్యాంకును పెంచుకునేందుకు, సానుభూతిని సొంతం చేసుకునేందుకు నాయకులు, పార్టీలు కూడా నిరంతరం మార్పులకు సిద్ధంగా ఉంటాయి. ఈ క్రమంలోనే టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కూడా మార్పులకు రెడీ అయ్యారు.
భాషపై పట్టుసాధించి…..
గతంలో తాను అవలంబించిన తీరును.. ప్రజల్లోని ఓవర్గం రిసీవ్ చేసుకోలేదు. పైగా సొంత పార్టీలోనూ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన ప్రసంగాల తీరు, హావభావాల తీరు విషయంలో 'పప్పు' అనే ముద్ర పడింది. దీనికి కారణం.. ఆయన ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. పొంతన లేకపోవడం, వివాదం కావడం. పైగా సుమో.. నేత అనే టాక్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన రియలైజ్ అయ్యారు. తన వాక్పటిమను మార్చుకున్నారు. తెలుగు పై సాధికారత పెంచుకున్నారు. పసలేని విమర్శలను తగ్గించి, నిర్మాణాత్మకంగా మారారు.
నిర్మాణాత్మకమైన విమర్శలకే….
ఇటీవల వరద ప్రభావిత ప్రాభావిత ప్రాంతాల్లో లోకేష్ టీడీపీ నేతలతో కలిసి పర్యటించినప్పుడు.. ఆయనలో ఇలాంటి మార్పులు స్పష్టంగా కనిపించాయి. సీఎం జగన్‌పై గతంలో అనేక విమర్శలు చేశారు. తుగ్లక్ అని.. నేరస్తుడు అని వ్యాఖ్యానించారు. వీటిని ప్రజల్లోని ఓ వర్గం రిసీవ్ చేసుకోలేదు. అలాగే మంత్రులపై నా వ్యాఖ్యలు చేసేవారు ఇప్పుడు మాత్రం ఈ తరహా శైలిని మార్చుకుని స్పష్టమైన తెలుగులో మాట్లాడారు. నిర్మాణాత్మక విమర్శలే చేశారు. దీంతో ఫీల్ గుడ్ నేతగా ఆయనపై కామెంట్లు వచ్చాయి.
నాని మాత్రం…..
అదే సమయంలో వైసీపీలోని కొందరు నేతలు, ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని.. కన్నబాబు వంటివారు మాత్రం తమ శైలిలో ఎలాంటి మార్పును చూపించడం లేదు. దీంతో వీరిపై విమర్శలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొడాలి నోరు విప్పితే.. ఏం మాట్లాడతాడో వినలేం బాబోయ్! అనే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతోందని అంటున్నారు పరిశీలకులు. వ్యక్తిగతంగా వారికి, పార్టీకి కూడా నష్టం చేకూరుస్తోందని చెబుతున్నారు. లోకేష్ వరద పర్యటనపై మాట్లాడిన కొడాలి.. వాడు వీడు.. అని సంబోధించడాన్ని ప్రజలే జీర్ణించుకోలేక పోతున్నారనేది ప్రధాన టాక్. మరి లోకేష్ మారాడు.. వీళ్లు ఎప్పుడు మారతారోనని అంటున్నారు.