డిఫరెంట్ స్టయిల్ తో.. ఎవరి ముద్ర పడకూడదనేనా?
సినిమాల్లో అనుకరించడం చూశాం. రాజకీయాల్లోనూ అనేక మంది ప్రముఖ నేతలను అనుకరిస్తారు. సహజంగా వారసత్వంగా వచ్చిన వారు తండ్రిని అనుకరించడం మామూలే. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు [more]
సినిమాల్లో అనుకరించడం చూశాం. రాజకీయాల్లోనూ అనేక మంది ప్రముఖ నేతలను అనుకరిస్తారు. సహజంగా వారసత్వంగా వచ్చిన వారు తండ్రిని అనుకరించడం మామూలే. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు [more]
సినిమాల్లో అనుకరించడం చూశాం. రాజకీయాల్లోనూ అనేక మంది ప్రముఖ నేతలను అనుకరిస్తారు. సహజంగా వారసత్వంగా వచ్చిన వారు తండ్రిని అనుకరించడం మామూలే. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సయితం తన తండ్రిని రాజకీయంగా అనుకరిస్తారని భావించారు. కానీ నారాలోకేష్ డిఫరెంట్ స్టయిల్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. ఆయనకు సన్నిహితులు కూడా అదే చెప్పడంతో నారా లోకేష్ తన తండ్రి ముద్ర పడకూడదని జాగ్రత్త పడుతున్నారు.
ఫిట్ నెస్ తో …..
విపక్షంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ లో అనేక మార్పులు వచ్చాయి. ప్రధానంగా శారీరకంగా కూడా ఆయన ఫిట్ నెస్ సంపాదించారు. గతంలో లావుగా ఉండే లోకేష్ లాక్ డౌన్ సమయంలో చేసిన ఎక్సర్ సైజ్ లు, డైటింగ్ కారణంగా బాగా తగ్గారు. ఇప్పుడు ఫిట్ గా కనపడుతున్నారు. ఇక ఇంతకుముందు డ్రెస్ కోడ్ కూడా నారా లోకేష్ పాటించే వారు కాదు. ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏదో ఒక డ్రెస్ తో వచ్చే వారు. పసుపు చొక్కాతో కూడా ఎక్కువగా కనపడే వారు. పసుపురంగు పార్టీ కలర్ కావడంతో పెద్దగా చర్చ జరగలేదు.
తెలుపు….నలుపు….
కానీ ఇప్పుడు లోకేష్ ఎక్కువగా తెలుపురంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటుతోనే ఎక్కువగా కనపడుతున్నారు. వైఎస్ జగన్ కూడా ఖాకీ రంగు ప్యాంటు, తెలుపు చొక్కాను పాదయాత్ర నుంచి ధరిస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే డ్రెస్ ను మెయిన్ టెయిన్ చేస్తున్నారు. లోకేష్ కూడా ఇప్పుడు నలుపురంగు ప్యాంటు, తెలుపు చొక్కానే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఆయన ఎక్కడకు వెళ్లినా ఇటీవల కాలంలో ఇదే డ్రస్ తో కనిపిస్తున్నారు.
పంచ్ లు విసురుతూ….
ఇక ఆహార్యం, ప్రసంగం విషయంలోనూ లోకేష్ కొత్త స్టయిల్ తో వెళుతున్నారు. తన తండ్రి చంద్రబాబు మాదిరిగా కాకుండా దూకుడుగా వెళ్లాలని లోకేష్ భావిస్తున్నట్లుంది. ట్విట్టర్ లో ఎటూ యాక్టివ్ గా ఉండే లోకేష్ ప్రసంగాల్లోనూ సయితం ఇటీవల కాలంలో పంచ్ లు విసురుతున్నారు. లోకేష్ విసిరిన పంచ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సలహాదారుల సూచనల మేరకే తండ్రి ముద్రపడకూడదని డిఫరెంట్ స్టయిల్ లో వెళ్లాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.