హీటెక్కిన మంగ‌ళ‌గిరి.. ఆళ్ల వ‌ర్సెస్ లోకేష్ .. ఏం జ‌రుగుతోంది?

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నియోజ‌క‌వ‌ర్గం గుంటూరులోని మంగ‌ళ‌గిరి . ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, టీడీపీ [more]

Update: 2020-04-01 02:00 GMT

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నియోజ‌క‌వ‌ర్గం గుంటూరులోని మంగ‌ళ‌గిరి . ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, టీడీపీ త‌ర‌ఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేయ‌డ‌మే దీనికి కార‌ణం. లోకేష్ ప్రత్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు రెండు సంవ‌త్సరాల పాటు ఎన్నో నియోజ‌క‌వ‌ర్గాలను వెతికి వెతికి చివ‌ర‌కు మంగ‌ళ‌గిరిని ఎంచుకున్నారు. ఎన్నిక‌ల చివ‌రి క్షణంలో అక్కడ పోటీ చేసిన లోకేష్ ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు. ఆళ్ల గ‌త 2014 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 12 ఓట్ల మెజారిటీ కంటే 4 వేల ఓట్ల మెజారిటీని సాధించి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఎన్నిక‌ల్లో లోకేష్ ఓడిపోయినా 9 నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు అందుబాటులోనే ఉంటున్నారు. మంగ‌ళ‌గిరిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన‌డంతో పాటు ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు.

ఓటమి పాలయినా…..

అయితే, ఇప్పుడు ఈ ఇద్దరి నాయ‌కుల మ‌ధ్య మ‌రోసారి ప‌రోక్షంగా పోటీ పెరిగింది. మూడు రాజధానుల అంశానికి మద్దతుగా ఆళ్ల.. కాదు, ఎట్టి ప‌రిస్థితిలోనూ తాను రాజధాని రైతులకు అండగా నిలిచి స‌త్తా చాటి.. ఏకంగా సీఎం జ‌గ‌న్‌కు బుద్ధి చెప్పాల‌ని లోకేష్‌లు పోటీ ప‌డుతున్నారు. లోకేష్ విష‌యానికి వ‌స్తే.. స్థానికంగా స‌త్తా చాటేందుకు ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనికి ఆయ‌న రాజ‌ధాని అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు.

ఆళ్లకు అన్నీ ఇబ్బందులేనా?

ప్రతి అంశాన్నీ త‌నే ద‌గ్గరుండి మ‌రీ చూసుకుంటున్నారు. ఇక‌, ఇప్పటికే ప్రజ‌ల మ‌ధ్య ఉంటున్నారు. ప్రభుత్వంపై విమ‌ర్శలు గుపిస్తున్నారు. ఇల్లిల్లూ తిరుగుతు న్నారు. ఇక‌, ఆళ్ల విష‌యానికి వ‌స్తే రెండు కార‌ణాలు బ‌లంగా ఆయ‌న‌కు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి రాజ‌ధాని ఎఫెక్ట్‌ను ఎదుర్కొని ఇక్కడ నిలబడటం కష్టమే. రెండు మంత్రి కావాల‌న్న త‌న ఆశ‌ల‌ను నిజం చేసుకోవ‌డం. రాజ‌ధాని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. అయితే, ఇక్కడి రైతులు మూడు రాజ‌ధానుల‌ను కోరుకుంటున్నారంటూ ఇటీవ‌ల కొంత‌మందిని వెంట‌పెట్టుకుని వెళ్లి సీఎంను క‌లిశారు.

గత ఎన్నికల్లో గెలిచినా….

అదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ ద‌గ్గర మాట కూడా పోతుంది. ఇక‌, జ‌గ‌నే మంత్రి పద‌వి ఇస్తాన‌ని చెప్పి ఇవ్వలేదు. ఈ విష‌యంలో తాను కూడా ఒత్తిడి చేయ‌లేదు. మంగళగిరి ప్రాంతంలో ఇప్పుడు రాజ‌ధాని ఎఫెక్ట్ మాత్రం ఆ పార్టీకిపై తీవ్రంగా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి, లోకేష్ లు ఇద్దరూ మంగళగిరిలో విస్తృతంగా పర్యటిస్తూ తిరిగి తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుల్లో తప్ప అందరూ తనకు అండగా ఉంటారని ఆళ్ల భావిస్తుండగా, మంగళగిరిలో ఈసారి తనదే విజయమన్న ధీమాలో లోకేష్ ఉన్నారు.

Tags:    

Similar News