ఈ మంత్రిగారు అలిగారా… సైలెంట్ వెనుక రీజనేంటి ?
వైసీపీలో కీలక మంత్రిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి అలిగారా ? లేక ఏదైనా అవమానం జరిగిందా ? ఇదీ.. ఇప్పుడు ఆసక్తిగా మారిన చర్చ. [more]
వైసీపీలో కీలక మంత్రిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి అలిగారా ? లేక ఏదైనా అవమానం జరిగిందా ? ఇదీ.. ఇప్పుడు ఆసక్తిగా మారిన చర్చ. [more]
వైసీపీలో కీలక మంత్రిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి అలిగారా ? లేక ఏదైనా అవమానం జరిగిందా ? ఇదీ.. ఇప్పుడు ఆసక్తిగా మారిన చర్చ. కొన్నాళ్లుగా ఆయన అసలు తాడేపల్లి వైపు కన్నెత్తి చూడడం లేదు. పైగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ ఆయన హడావిడి ఎక్కడా కనిపించలేదు. జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన మరో మంత్రి అనిల్ అక్కడ వ్యవహారాలు అన్ని చక్క పెట్టేశారు. ఉప ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రచారం చేయాలని.. సీఎం జగన్ ఆదేశిం చినా.. తొలి రెండు రోజులు వచ్చి.. మమ అనిపించి వెళ్లిపోయారు. అప్పుడు కూడా తనే ఒంటరిగా ప్రచారం చేశారు. కీలకమైన మంత్రి, ఇదే జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనూ నారాయణస్వామి కలిసి పనిచేయలేదు.
అసహనానికి కారణమేంటి?
నారాయణ స్వామి అసహనానికి కారణం ఏంటి ? ఏం జరిగింది? అనేది చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఆయన గురించి.. ఆసక్తి కర సమాచారం ఒకటి వైసీపీలో హల్ చల్ చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో ఆయన దూకుడు చూపించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతుదారులు ఎక్కువగా గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించారు. అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆయన కొంత మేరకు కృషి చేశారు. ఇక, ఇక్కడ వచ్చిన ఫలితాలు.. సీఎం జగన్‌కు ఆనందం కలిగించాయి. అయితే.. ఈ క్రెడిట్ లో .. మంత్రి నారాయణస్వామికి ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.
ఆయనకే క్రెడిట్ అంతా…
పైగా.. మొత్తంగా క్రెడిట్ అంతా.. మంత్రి పెద్దిరెడ్డికే దక్కిందని.. సీఎం జగన్ దగ్గర ఆయనకే మంచి మార్కులు లభించాయని.. దీంతో నారాయణ స్వామి ముభావంగా ఉంటున్నారని అనుచరులు పేర్కొంటున్నారు. మరోవైపు.. నగరి వైసీపీ పంచాయతీ విషయం కూడా మంత్రి నారాయణస్వామికి సెగ పెడుతోందని అంటున్నారు. ఇక్కడ నిజానికి ఆయన ప్రభావం తక్కువే ఉన్నా.. పెద్దిరెడ్డితో కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రభావం కూడా ఉందనే భావనలో ఎమ్మెల్యే రోజా కామెంట్లు చేశారు.
అందుకే సైలెంట్…?
ఇక ఇటీవల మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా నారాయణస్వామికి సీఎం జగన్ అపాయింట్‌మెంట్ రాని పరిస్థితులు కొన్ని సార్లు తలెత్తాయట. ఈ పరిణామాలపై సీఎం జగన్ కానీ, కీలక సలహాదారులు కానీ, ఆయనతో సంప్రదించలేదు. ఇక, ఎంత చేసినా.. తనకు ఏమాత్రం వాల్యూ ఇవ్వడం లేదని భావిస్తున్నారని.. అందుకే నారాయణస్వామి సైలెంట్ అయ్యారని చెబుతున్నారు.