హాయ్ విజయ్ గారు, ప్రధాని పలకరింపుతో మరింత క్రేజీ అయ్యారే ?

ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తరువాత నెంబర్ 2 ఎవరంటే అంతా టక్కున చెప్పే పేరు రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి.జగన్ పై బనాయించిన [more]

Update: 2019-06-20 02:58 GMT

ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తరువాత నెంబర్ 2 ఎవరంటే అంతా టక్కున చెప్పే పేరు రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి.జగన్ పై బనాయించిన కేసుల్లోనూ ఆయన ఎ 2 అంటూ అంతా అవహేళన చేశారు ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మారింది. నాడు నిందితుడు 2 గా అని పిలవబడిన విజయ సాయి ఎపి ముఖ్యమంత్రి తరువాత ఆయనే నెంబర్ 2 అనే స్థాయికి చేరారు. పార్లమెంట్ లో వైసిపి వ్యూహాల దగ్గర నుంచి ఎపి లో పార్టీ దూసుకుపోవడంలో సాయి రెడ్డి పాత్ర అనిర్వచనీయం. ఎన్నికలు సమీపించే కొద్దికాలం వరకు తెరవెనుక మాత్రమే దర్శనమిచ్చిన విజయ సాయి రెడ్డి ఇప్పుడు కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్నారు.

నాడు కెవిపి వైఎస్ ఆత్మ అయితే నేడు జగన్ కి ….

గతంలో వైఎస్సాఆర్ కు ఆత్మగా కెవిపి రామచంద్ర రావు వుండే వారు. ఇప్పుడు విజయ సాయి రెడ్డి ఆ స్థానం జగన్ దగ్గర భర్తీ చేశారని పార్టీ వర్గాల్లో టాక్. ఇటీవల రోజా కు మంత్రి పదవి రాలేదని అలిగిన సందర్భంలో జరిగిన చర్చల్లో సాయి రెడ్డి కీ రోల్ అందరికి తెలిసిందే. ఆయనతో గంటసేపు భేటీ అయిన రోజా జగన్ తో 10 నిమిషాలే సమావేశం అయ్యిందంటే వైసిపి చాణుక్యుడు పాత్ర చెప్పక చెప్పొచ్చు. పార్టీలో ట్రబుల్ షూటర్ బాధ్యతలను కూడా ఆయన చాలాకాలం నుంచి నెత్తికి ఎత్తుకున్నారు. బూత్ కార్యకర్తలకు శిక్షణ నుంచి అభ్యర్థుల ఎంపిక లో ఆయన కీ రోల్ వహించారు. ఇటీవల జగన్ రూపొందించిన క్యాబినెట్ లోను విజయ సాయి ఆలోచనలు ఉన్నాయని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే టిడిపి సైతం జగన్ తరువాత గతంలో సాయి రెడ్డి ని చాలా టార్గెట్ చేసేది. ఎన్నికల ముందు నుంచి సోషల్ మీడియా వేదికగా విజయ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టిడిపి పై సాగించిన యుద్ధం వైసిపి అధికారం చేపట్టాకా కూడా తనదైన శైలిలో కొనసాగిస్తున్నారు ఆయన.

ప్రధాని పిలుపుతో ….

ఇవన్నీ పక్కన పెడితే తాజాగా దేశంలోని అన్ని పార్టీలతో ఐదు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెళ్లారు. సమావేశం ముగిసాకా ఎపి సిఎం కోసం వేచి చూస్తున్నారు విజయ సాయి రెడ్డి. అప్పుడు జరిగిన చిన్న సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. మీటింగ్ నుంచి బయటకు వస్తున్న ప్రధాని దూరంగా వున్న విజయ సాయి రెడ్డి ని చూసి హాయి విజయ్ గారు అంటూ పిలవడం అందరిని అఛ్చార్యానికి గురిచేసింది. ప్రధాని హాయ్ తో ఆయన దగ్గరకు వెళ్లి నమస్కరించి కరచాలనం చేశారు విజయ సాయి రెడ్డి. దాంతో ఢిల్లీ లో సాయి రెడ్డి లాబీయింగ్ వ్యవహారం ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి అందరికి తెలిసి వచ్చింది. టిడిపి ఎన్డీయే నుంచి బయటకు రావడానికి విజయ సాయి రెడ్డి రూపొందించిన వ్యూహం అన్నది పొలిటికల్ టాక్. సాక్షాత్తు ప్రధాని మోడీ పార్లమెంట్ లో అవిశ్వాసం పై మాట్లాడుతూ టిడిపి వైసిపి ఉచ్చులో పడిందన్నారు. ఆ ఉచ్చు తయారు చేసింది విజయ సాయి రెడ్డి మాస్టర్ మైండ్ అన్నది ఇప్పుడు తేటతెల్లం అయ్యింది. టిడిపి కి బిజెపికి పొగ పెట్టేందుకు రాజ్యసభ సభ్యుడు అయ్యాకా విజయ సాయి చేయని ప్రయత్నం లేదు. ఒక్కడై ఢిల్లీ లోని కీలకనేతలందరితో టచ్ లో వుంటూ వైసిపి వైపుగా చూసేలా ఆయన చేసిన ప్రయత్నాలు మామూలు కాదు. ఇప్పుడు ఏపీలోనే కాదు ఢిల్లీ లోను ఆయన నామస్మరణే సాగుతుండటం విశేషం.

Tags:    

Similar News