డ్రెస్ లు, డైలాగులే….. పనిచేసేదేమైనా ఉందా?

ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో క్రమంగా అపోహలు తొలిగిపోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు. మోదీ బలమైన నాయకుడని, దేశాన్ని ఎక్కడికో తీసుకెళతాడని భావించిన ప్రజలు మోదీ [more]

Update: 2020-09-29 17:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో క్రమంగా అపోహలు తొలిగిపోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు. మోదీ బలమైన నాయకుడని, దేశాన్ని ఎక్కడికో తీసుకెళతాడని భావించిన ప్రజలు మోదీ వ్యవహారశైలిని చూసి తలలు పట్టుకుంటున్నారు. మీడియా లో పవర్ ఫుల్ డైలాగులు చెప్పడమే తప్ప చేసేది మాత్రం శూన్యమనే చెప్పాలి. కేవలం సెంటిమెంట్ మీదనే మోదీ ఇప్పటికీ బలంగా కనపడుతున్నారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.

ఆరేళ్ల పాలనలో……

మోదీని ఆరేళ్ల పాలన చూసిన తర్వాత ప్రజలు పెదవి విరుస్తున్నారు. మోదీ ఏదో చేస్తారని భావించిన వారు నిరాశ చెందుతున్నారు. గుజరాత్ వంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన మోదీ, దేశాన్ని కూడా అదే విధంగా నడిపిస్తారని భావించారు. అయితే మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు నిరాశను కల్గిస్తున్నాయి. కరోనా సమయంలోనూ ప్రజలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు తప్పించి వైరస్ ను కట్టడి చేసే ప్రయత్నాలేవీ చేయలేదన్న వాదన బలంగా ఉంది.

ఇబ్బంది పెట్టే నిర్ణయాలు…..

ఇక వ్యవసాయ సంస్కరణ బల్లులు, విద్యుత్ బిల్లులతో దేశమంతటా మోదీ పట్ల వ్యతిరరేకత కన్పిస్తుందంటున్నారు. హిందుత్వ, సరిహద్దు సెంటిమెంట్లతోనే మోదీ కాలం వెళ్లబుచ్చుతున్నారన్న వ్యాఖ్యలు కూడా దేశమంతటా విన్పిస్తున్నాయి. అయితే ఇప్పటికే మోదీకి ధీటైన బలమైన నాయకత్వం లేకపోవడం వల్లనే ఆయన చరిష్మా చెక్కు చెదరడం లేదనే వారు కూడా లేకపోలేదు. నోట్ల రద్దు నుంచి మోదీ తీసుకున్న ఏ నిర్ణయమూ ప్రజలకు ప్రయోజనం కల్గించలేదు.

ప్రజలను పట్టించుకోకుండా……

కరోనా సమయంలో ప్రజలు క‌ష్టాల్లో ఉంటే పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ పోతుండటం కూడా ప్రజల్లో అసహనానికి కారణంగా చెప్పవచ్చు. మోదీ డ్రెస్ లు, డైలాగులపై పెట్టిన శ్రద్ధ ప్రజల సంక్షేమం కోసం పెట్టడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ మీడియాకు బాగా వ్యతిరేకత కన్పిస్తుంది. మోదీ ఇమేజ్ తగ్గిందా? లేదా? అన్నది రానున్న రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేలుస్తాయనే వారు కూడా ఉన్నారు. మొత్తం మీద మోడీ మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు ఏమాత్రం నెరవేరలేదనే చెప్పాలి.

Tags:    

Similar News