మోదీ అందరి గొంతులు నొక్కేశారు
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి గొంతులు మూగబోయాయి. గతంలో ప్రజాసమస్యలపైనా, ముఖ్య ఘటనలపైనా స్పందించే వారు సయితం ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. అసహనం [more]
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి గొంతులు మూగబోయాయి. గతంలో ప్రజాసమస్యలపైనా, ముఖ్య ఘటనలపైనా స్పందించే వారు సయితం ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. అసహనం [more]
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి గొంతులు మూగబోయాయి. గతంలో ప్రజాసమస్యలపైనా, ముఖ్య ఘటనలపైనా స్పందించే వారు సయితం ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. అసహనం పెరిగిపోతున్నా దానిని ప్రకటించేందుకు ఎవరూ సిద్ధపడటం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ నటులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చెలరేగిపోయేవారు. ప్రతి అంశం మీద స్పందించేవారు. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తమ వేళ్లకు, నోళ్లకు పనిచెప్పడం లేదు.
నోరు మెదపడం లేదే….
అవును నిజమే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ప్రతి అంశంపై స్పందించేవారు. ముఖ్యంగా పెట్రోలు ధరలు పెరిగినప్పుడు వీరు చేసే ట్వీట్లు అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కూడా వీరు ఒక కారణమని చెప్పక తప్పదు. అదే మోదీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో పలువురు తప్పుపడుతున్నారు.
సోషల్ మీడియాలో….
ఇప్పటికే కాంగ్రెస్ బాలీవుడ్ అగ్రనటులను టార్గెట్ చేసినట్లే కన్పిస్తుంది. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లు రియల్ హీరోలు కాదంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ లీడర్ నానో పటోలే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి. పెట్రోలు, డీజిల్ ధరలు రోజూ పెరుగుతున్నా వీరు నోరు మెదపకపోవడంపై ఆన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అండతోనే కీర్తిని, సొమ్మును సంపాదించుకున్న వీరు మోదీకి తొత్తులుగా మారిపోయారని సోషల్ మీడియాలో కామెంట్లు గట్టిగానే పడుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలో ఉండగా….
వారి సినిమాలను కూడా బహిష్కరించాలని, విడుదలయిన రోజున నల్లజెండాలతో నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు కూడా. నిజమే.. ఇది ఒక్క అమితాబ్, అక్షయ్ కుమార్ కు మాత్రమే వర్తించదు. అనేక రంగాల్లో ప్రముఖులు కాంగ్రెస్ అధికారంలో ఉండగా చెలరేగిపోయేవారు. ప్రజల పక్షాన ఉండేవారు. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అంతా ఫీల్ గుడ్ అంటుండమే విచిత్రంగా ఉంది. ఇందుకు మోదీ తో ఎందుకు పెట్టుకోవడమేనన్న భయమే కారణం కావచ్చు.