మోడీ మూడ్ ఆఫ్ ది నేషన్ అయ్యారా?

నాయకుడి నాయకత్వం కీలక సమయంలోనే బయటపడుతుంది. ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ లో అన్ని కోణాలు క్లిష్ట సమయంలో బయటకు వచ్చేస్తున్నాయి. దేశాన్ని కాపాడటానికి మోడీ [more]

Update: 2020-04-12 18:29 GMT

నాయకుడి నాయకత్వం కీలక సమయంలోనే బయటపడుతుంది. ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ లో అన్ని కోణాలు క్లిష్ట సమయంలో బయటకు వచ్చేస్తున్నాయి. దేశాన్ని కాపాడటానికి మోడీ ఇప్పుడు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఎనీ టైం ఫోన్ చేయండి అంటూ ఒక పక్క చెబుతూనే అదే స్థాయిలో తన స్టామినా చాటిచెబుతున్నారు. రాజకీయాలు పూర్తిగా పక్కన పెట్టి రాగద్వేషాలు తీసిపారేసి తరచూ ముఖ్యమంత్రులతో భేటీ అవుతూ దిశా దశా నిర్దేశం చేయడమే కాదు వారినుంచి వచ్చే సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు.

టీం గానే జయించగలం …

కరోనా వైరస్ తీవ్రత ప్రపంచం తో పోలిస్తే తగ్గించాలంటే ఒక టీం గా ఇండియా పోరాడాలి. అందుకు తగ్గట్లే ప్రధాని రంగంలోకి దిగి అందరిని కలుపుకుని వెళ్లిపోతున్నారు. తన సహజ ధోరణికి భిన్నంగా అన్ని పార్టీలతోనూ మోడీ టచ్ లో ఉంటున్నారు. దేశంలోని అన్ని వర్గాలతో వీడియో కాన్ఫరెన్స్ లతో మాట్లాడుతున్నారు. సమిష్టి తత్వమే యుద్ధంలో విజయానికి మార్గం అవుతుంది. సరిగ్గా ప్రధాని ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ క్లిష్ట సమయంలో తన నాయకత్వ పటిమ ప్రదర్శిస్తున్నారు.

విపక్షాలు సైతం …

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వంటివారు మోడీని విమర్శించడంలో ముందు ఉండేవారు. అలాంటి నేతలు కూడా ప్రధాని మన లీడర్ ఆయన చెప్పిందే మనం చేయాలని స్ఫూర్తిని ఇస్తున్నారు. ఇదే రీతిలో మోడీ అంటే ఒంటికాలిపై లేచే దేశంలోని కొన్ని రాజకీయపార్టీలు సైతం ప్రధానిని తప్పు పట్టేందుకు వెనుకాడుతున్నాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు వాటిలో అందరి ఆమోదం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో కల్పించడంతో పాటు వారిచేత తప్పట్లు కొట్టించి, దీపాలు వెలిగించే కార్యక్రమాలతో బాటు వైరస్ పై వార్ లో వారి బాధ్యతను గుర్తు చేస్తూ అందరు భాగస్వాములే అని పదేపదే గుర్తు చేస్తూ దటీజ్ మోడీ అనేలా సాగిపోతున్నారు

Tags:    

Similar News