థర్డ్ వేవ్ కంటే… మూడోసారి మోదీ వస్తే?

కరోనా థర్డ్ వేవ్ కాదు.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మూడోసారి మోదీ ప్రభుత్వం వస్తే దాని కంటే ప్రమాదకరమన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి. అంతర్జాతీయంగా మోదీ [more]

Update: 2021-07-03 16:30 GMT

కరోనా థర్డ్ వేవ్ కాదు.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మూడోసారి మోదీ ప్రభుత్వం వస్తే దాని కంటే ప్రమాదకరమన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి. అంతర్జాతీయంగా మోదీ ప్రధానిగా సర్వేల్లో మంచి మార్కులు పొందవచ్చు. కానీ దేశంలో మాత్రం మోదీ ఇమేజ్ మాత్రం పూర్తిగా పడిపోయింది. కరోనా సెకండ్ వేవ్ బీజేపీ పాలిట శాపంలా మారిందనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ విజయావకాశాలు తక్కువే.

ఏడేళ్లలో….

మోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తుంది. ఈ ఏడేళ్లలో ఏ వర్గం సంతోషంగా లేదు. కేవలం సెంటిమెంట్ ఆధారంగానే ఎప్పుడూ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. మోదీపై అవినీతి మచ్చ లేకపోవడం, ఏదో చేస్తాడన్న నమ్మకంతో రెండుసార్లు ప్రజలు మోదీని విశ్వసించారు. ఏమీ చేయలేని మొగుడు మంచం నిండా ఉన్నా ఉపయోగమేంటన్న సామెత మోదీ విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఈ ఏడేళ్ల కాలంలో ప్రజలకు చేసిందాని కన్నా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చిందే ఎక్కువ.

ఈ ఎన్నికల తర్వాత….

ఇక త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాలల్లో నాలిగింటిలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికలు బీజేపీకి సెమి ఫైనల్స్ అనే చెప్పాలి. ఈ ఎన్నికల్లోనూ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఎక్కడా అధికారంలోకి వచ్చే అవకాశం కన్పించడం లేదు. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుంది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ చరిష్మా మరింత మసకబారనుందన్నది విశ్లేషకుల అంచనా.

విపక్షాలు….

మోదీ ధైర్యం తమకు దీటైన ప్రత్యర్థి లేకపోవడమే. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలు ఉన్నా కాంగ్రెస్ కుకూడా అవి శత్రువులుగా మారాయి. ఇప్పటి వరకూ దూరంగా ఉన్న పార్టీలు ఇప్పుడిప్పుడే ఏకమవుతున్నాయి. 2024 సాధారణ ఎన్నికల నాటికి విపక్షాలు కూడా ఒక్కటయ్యే పరిస్థితి ఉంది. అదే జరిగితే మోదీ మూడోసారి రావడం కష్టమే. ప్రజలు కూడా కోరుకుటుంది అదే.

Tags:    

Similar News