అ”జిత్తు”లను చిత్తు చేశారా?
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి ఎప్పుడు తెరపడనుంది? సుప్రీంకోర్టు తీర్పుతో మరికొద్ది గంటల్లోనే సంక్షోభం కొలిక్కి వస్తుందా? అనే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరిబలం ఎంత? [more]
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి ఎప్పుడు తెరపడనుంది? సుప్రీంకోర్టు తీర్పుతో మరికొద్ది గంటల్లోనే సంక్షోభం కొలిక్కి వస్తుందా? అనే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరిబలం ఎంత? [more]
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి ఎప్పుడు తెరపడనుంది? సుప్రీంకోర్టు తీర్పుతో మరికొద్ది గంటల్లోనే సంక్షోభం కొలిక్కి వస్తుందా? అనే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరిబలం ఎంత? ఎవరిది గెలుపు? దీనిపై బెట్టింగ్ లు కూడా నడుస్తున్నాయి. అయితే ఈ మొత్తం డ్రామాలో పవార్ కుటుంబమే కీలక పాత్ర పోషించనుంది. సభలో బలనిరూపణ జరిగితే ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే అధికారం. అందుకే అన్ని పార్టీలూ ఎమ్మెల్యేలు పట్టు జారి పోకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల వద్ద శివసైనికులు కాపలా కాస్తున్నారు. చీమ కూడా దూరకుండా చర్యలు తీసుకున్నారు. వారి వద్ద మొబైల్ ఫోన్లను కూడా తీసుకున్నారు.
ఎమ్మెల్యేలందరూ…..
ఇక అజిత్ పవార్ విషయానికొస్తే ఆయన బీజేపీ చెంత సులువుగానే చేరిపోయారు. తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఆయన తొలినుంచి చెబుతూ వస్తున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ అజిత్ పవార్ ఒంటరిగా మిగిలిపోతున్నారని పిస్తోంది. మొత్తం 54 మంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీపీ నుంచి గెలిచారు. అయితే తాజాగా శరద్ పవార్ నిర్వహిస్తున్న శిబిరంలో 50 మంది వరకూ ఉన్నారు. మిగిలిన ముగ్గురు కూడా ఈరోజు శరద్ పవార్ గూటికి చేరినట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేలు సంతకాలు వేరే పనిపై చేయించుకుని అజిత్ పవార్ ఈ దారుణానికి పాల్పడ్డారని అంటున్నారు.
తిరిగి ఎన్సీపీలోకి…..
అయితే అజిత్ పవార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు గడుస్తున్నా ఏ ఎన్సీపీ నేత అజిత్ పవార్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం లేదు. ఆయనపై ఒక్క శరద్ పవార్ మాత్రమే విమర్శలు చేశారు. అజిత్ పవార్ ఎప్పటికైనా తిరిగి ఎన్సీపీలోకి వస్తారని భావించిన నేతలు ఆయనపై విమర్శలు చేయడానికి సాహసించడం లేదు. ప్రస్తుతం అజిత్ పవార్ ఒక్కరే మిగిలిపోయారు. ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ తిరిగి శరద్ పవార్ గూటికి చేరుకున్నారు. అజిత్ పవార్ ను కూడా తిరిగి ఎన్సీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బీజేపీ వ్యూహమేంటి?
మరి అజిత్ పవార్ ఒక్కరితోనే బీజేపీ ఎలా బలనిరూపణ చేసుకుంటుందన్నది ప్రశ్న. మహారాష్ట్రలో 14 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు 15 మంది చిన్నా చితకా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో దాదాపు 20 మంది వరకూ తమకు మద్దతిస్తున్నారని బీజేపీ భావిస్తుంది. అజిత్ పవార్ వర్గం తమతోనే ఉంటుందని భావించిన బీజేపీ నేతలకు వరస పరిణామాలు షాక్ కు గురిచేస్తున్నాయి. మరి బలపరీక్ష సందర్భంగా ఎలాంటి హైడ్రామా చోటుచేసుకుంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. బీజేపీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయపార్టీల్లోనూ లేకపోలేదు.