ఈయన కూడా మినహాయింపు కాదు

మహారాష్ట్రలో కూటమి రాజకీయం అంత సులువు కాదు. సంకీర్ణ సర్కార్ ను నిలబెట్టుకోవడం కూడా కష్టమేనని పార్టీ అధినేతలకు తెలిసి వచ్చింది. నిన్న మొన్నటి వరకూ అంతా [more]

Update: 2020-01-03 17:30 GMT

మహారాష్ట్రలో కూటమి రాజకీయం అంత సులువు కాదు. సంకీర్ణ సర్కార్ ను నిలబెట్టుకోవడం కూడా కష్టమేనని పార్టీ అధినేతలకు తెలిసి వచ్చింది. నిన్న మొన్నటి వరకూ అంతా తాము చెప్పినట్లే ఎమ్మెల్యేలు నడుచుకుంటారన్న భ్రమలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అియతే మంత్రి వర్గ విస్తరణ తర్వాత అన్ని పార్టీల్లో అసంతృప్తులు స్పష్టంగా కన్పించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

నెల రోజులకు గాని…..

ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు నెల రోజులకు గాని మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. మంత్రి వర్గ విస్తరణపై మూడు పార్టీలు మల్లగుల్లాలు పడ్డాయి. ఎవరికి కోపం వచ్చినా ఇబ్బందులు తప్పవని తెలుసు. అందుకే ఆచితూచి మంత్రివర్గ విస్తరణ చేశారు. శివసేన నుంచి 12 మంది, ఎన్సీపీల నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి పది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఏకపక్ష నిర్ణయాలంటూ….

అయితే ఎన్సీపీలో సీనియర్ నేతలను పక్కన పెట్టారన్న విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీలో ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతున్నాయంటూ కొందరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి బయలుదేరింది. ముఖ్యంగా అజిత్ పవార్ ను తిరిగి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయడాన్ని కొందరు బహిరంగంగానే తప్పపడుతున్నారు. పార్టీని ముంచేయాలని చూసిన అజిత్ పవార్ కు తిరిగి అదే పదవిని అప్పగించడం ద్వారా క్యాడర్ లోనూ, ఓటు బ్యాంకులోనూ తప్పుడు సంకేతాలు వెళ్లాయని అభిప్రాయం వ్యక్తమయింది.

రాజీనామా కలకలం…..

మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎన్సీపీలో సీనియర్ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి పనికిరానంటూ బీద్ జిల్లా మజిల్ గాన్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్ సోలంకే రాజీనామా చేయడం ఎన్సీపీలో కలకలం రేపింది. ఆయన తన రాజీనామాకు కారణాలు బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ అజిత్ పవార్ కు పదవి ఇవ్వడం, సీనియర్లకు మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కకపోవడమే కారణమని చెబుతున్నారు. మరికొంత మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు సయితం తీవ్రస్థాయిలో అసంతృప్తిలో ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News