ట్రీట్ మెంట్ సరిగా లేదట…. బాధగా ఉందంటున్నాడు

తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తల్లి మంత్రిగా పనిచేశారు. కానీ ఆయనకు మాత్రం రాజకీయాలు అచ్చివచ్చినట్లు కన్పించడంలేదు. ఆయనే మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ [more]

Update: 2020-11-17 06:30 GMT

తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తల్లి మంత్రిగా పనిచేశారు. కానీ ఆయనకు మాత్రం రాజకీయాలు అచ్చివచ్చినట్లు కన్పించడంలేదు. ఆయనే మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి. వైసీపీలో ఉన్నా ఆయనను ఇప్పుడు ఎవరూ పట్టించుకునే వారు లేరు. వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో పట్టున్న నేదురుమిల్లి కుటుంబాన్ని జగన్ పక్కన పెట్టేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

వైసీపీలో చేరి….

నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి తొలుత బీజేపీలో చేరారు. ఆతర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకదశలో టీడీపీ హైకమాండ్ నెల్లూరు ఎంపీ టిక్కెట్ ఇస్తామని చెప్పినా వద్దనుకుని వైసీపీలో చేరారు. నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి నిజానికి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఆయన ఎప్పటి నుంచో అక్కడ పనిచేసుకుంటూ వెళుతున్నారు. కానీ ఆనం రామనారాయణ రెడ్డి చేరికతో మొన్నటి ఎన్నికల్లో నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని జగన్ పక్కన పెట్టారు.

పదవి కోసం ఎదురు చూసి…..

అధికారంలోకి వస్తే పదవి ఇస్తానని నాడు జగన్ రామ్ కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు. అయితే పదిహేడు నెలలు గడుస్తున్నా నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని జగన్ పట్టించుకోవడం లేదు. ఇటీవల నెల్లూరు జిల్లాలో పర్యటించిన పార్టీ జిల్లా ఇన్ ఛార్జి సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి తన గోడును నేదురుమిల్లి చెప్పుకున్నారట. తన సంగతేంటని సజ్జలను రామ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను జగన్ దృష్టికి తీసుకెళతానని చెప్పి సజ్జల తప్పించుకున్నారని సమాచారం.

పట్టించుకోవడం లేదని……

అయితే తనను పట్టించుకోకపోవడంపై నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం లేదు. కనీసం నామినేటెడ్ పోస్టు అయినా ఇస్తారని ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో నేరుగా జగన్ ను కలసి తన గోడును విన్పించాలని రామ్ కుమార్ రెడ్డి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. అయితే వెంకటగిరి లో ఆనం రామనారాయణరెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పార్టీలో ఉంటారో? లేదో? కూడా తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలో మరికొంత కాలం వెయిట్ చేయాలని నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News