టీడీపీలో కొత్త జోష్‌.. కార‌ణ‌మేంటి…?

ఏపీ టీడీపీలో కొత్త జోష్ క‌నిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అంద‌రిలోనూ కొత్త ఉత్సాహం తొణికిస‌లాడుతోంది. దీనికి కార‌ణ‌మేంటి ? ఏం జ‌రిగింది ? అనే [more]

Update: 2021-01-02 00:30 GMT

ఏపీ టీడీపీలో కొత్త జోష్ క‌నిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అంద‌రిలోనూ కొత్త ఉత్సాహం తొణికిస‌లాడుతోంది. దీనికి కార‌ణ‌మేంటి ? ఏం జ‌రిగింది ? అనే విష‌యాలు ఆస‌క్తిగా ఉన్నాయి. వాస్తవానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీలో ఒక విధ‌మైన నిర్వేదం తొంగి చూసింది. పార్టీ చ‌రిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయి 23 సీట్లకు ప‌రిమితం కావ‌డం.. వీరిలో న‌లుగురు పార్టీని వీడ‌డం, ప‌లువురు నేత‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం.. కొంద‌రు క్రియాశీల‌కంగా లేక‌పోవ‌డం లాంటి కార‌ణాల‌తో ఎవ్వరూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇది టీడీపీ పై తీవ్ర ప్రభావం చూపించింది. గ‌డిచిన రెండు మూడు వారాలుగా మాత్రం ప‌రిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

జమిలి ఎన్నికలతో……

ఇప్పుడు ఎక్కడ చూసినా టీడీపీ నాయ‌కులు మీడియా ముందుకు వ‌స్తున్నారు. అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల‌ను నిత్యం టార్గెట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు క‌నిపించ‌ని నాయ‌కులు కూడా ఇప్పుడు రోజూ ఏదో ఒక రూపంలో మీడియా ముందుకు వ‌చ్చి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీనికి రీజ‌నేంటి? అంటే.. సీనియ‌ర్లు చెబుతున్న దాని ప్రకారం.. త్వర‌లోనే రాష్ట్రంలో జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని… దేశ‌వ్యాప్తంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు జ‌మిలి ఎన్నిక‌లు తెస్తామ‌ని ప్రధాని న‌రేంద్ర మోదీ ఇటీవ‌ల ప్రక‌టించారు. దీంతో చంద్రబాబు కూడా ఈ విష‌యాన్ని ప‌దేప‌దే ప్రస్తావిస్తున్నారు.

ఆ ప్రకటనతోనే…..

చంద్రబాబు ప్రతి రోజూ జ‌మిలీ ఎన్నిక‌ల‌కు రెడీగా ఉండాల‌ని చెపుతున్నా త‌మ్ముళ్లు మాత్రం బాబు గారు ఎందుకు మా బుర్రలు తింటున్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. ఆదిలో ఈ విష‌యాన్ని త‌మ్ముళ్లు పెద్దగా విశ్వ‌సించ‌లేదు. కానీ, ఇటీవ‌ల కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా జ‌మిలికి తాము సై అంది! అంతేకాదు. దీనికి సంబంధించి పార్లమెంటు చేయాల్సిన చ‌ట్ట స‌వర‌ణ చేస్తే.. జ‌మిలి ఎన్నిక‌లు నిర్వహిస్తామ‌ని చెప్పుకొచ్చింది. దీంతో అటు మోడీ చెప్పింది.. ఇటు బాబు చెప్పింది జ‌మిలీపై స్పష్టంగా ఉండ‌డంతో టీడీపీ నేతలు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు.

అందుకే జోష్….

ప్రస్తుతం ఇసుక‌, మ‌ద్యం, పెట్రోల్ ధ‌ర‌ల పెంపు, నిత్యావ‌స‌ర ధ‌ర‌ల పెరుగుద‌ల‌, వైసీపీ నేత‌ల అక్రమాలు వంటివి ప్రజ‌ల్లో చ‌ర్చనీయాంశంగా ఉండ‌డంతో ప్రభుత్వంపై వ్యతిరేక‌త పెరుగుతోంద‌న్న అంశంపై ఎక్కువుగా చ‌ర్చలు న‌డుస్తున్నాయి. దీనిని జాగ్రత్తగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళితే త‌‌మ‌కు గెలుపు సాధ్యమేన‌ని టీడీపీ నేతలు భావిస్తున్నారు. పైగా వ‌చ్చే ఏడాది 2021 చివ‌రి నాటికే జ‌మిలి పూర్తి అయిపోతుంద‌ని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు వీరిలో జోష్ పెర‌గ‌డానికి కార‌ణ‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్రమంలోనే నిన్నమొన్నటి వ‌ర‌కు పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉన్న యువ‌నేత‌లు, సీనియ‌ర్ నేత‌లు ఒక్క‌సారిగా ప్రజ‌ల్లోకి వ‌చ్చి ప్రభుత్వ విధానాల‌పై విమ‌ర్శలు చేస్తున్నారు. జ‌మిలీ మోడీ నోట రాక‌ముందు వ‌ర‌కు నిర్వేదంలో ఉన్న టీడీపీ నాయ‌కుల‌కు ఈ మాట త‌ర్వాత ఉత్సాహంతో ఉన్నారు. మ‌రి ఈ ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తారా ? లేదా? అన్నదే చూడాలి.

Tags:    

Similar News