బోర్ కొడుతోంది.. కొత్తవారికి ఛాన్స్ ఇవ్వండ‌య్యా

“ఇదిగో.. మావోడు ఏదో మాట్లాడతాడు కానీ. పెద్దగా క‌వ‌రింగ్ వ‌ద్దు! నేను చెప్పాను క‌దా.. అది చాలు!!“- ఇదీ.. ఇప్పుడు టీడీపీలో సీనియ‌ర్లు ఆఫ్ ది రికార్డుగా [more]

Update: 2020-10-19 13:30 GMT

“ఇదిగో.. మావోడు ఏదో మాట్లాడతాడు కానీ. పెద్దగా క‌వ‌రింగ్ వ‌ద్దు! నేను చెప్పాను క‌దా.. అది చాలు!!“- ఇదీ.. ఇప్పుడు టీడీపీలో సీనియ‌ర్లు ఆఫ్ ది రికార్డుగా త‌మ అనుకూల మీడియాకు చేస్తున్న సూచ‌న‌లు..! దీంతో జూనియ‌ర్లు, ఇటీవ‌ల ప‌గ్గాలు చేప‌ట్టిన నాయ‌కులు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు గుర్తింపు లేకుండా పోతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయ్యన్నపాత్రుడు, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి, బుచ్చయ్య చౌద‌రి వంటి సీనియ‌ర్లు మాట్లాడితేనే .. అనుకూల మీడియాలో అయినా ప్రచారం ఉంటోంది.

కవరేజీ లేకపోవడంతో….

ఇక‌, జూనియ‌ర్లు, ఇటీవ‌ల ప‌గ్గాలు చేప‌ట్టిన పార్లమెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌లు.. కొంద‌రు మ‌హిళా నేత‌లు మాట్లాడితే.. మాత్రం ఎక్కడా క‌వ‌రింగ్ లేదు. దీంతో.. అబ్బ.. బోర్ కొడుతోంది.. కొత్తవారికి ఛాన్స్ ఇవ్వండ‌య్యా! అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీలో అయినా.. సీనియ‌ర్లు ముఖ్యమే. అదే స‌మ‌యంలో కొత్త నీటిని కూడా ప్రోత్సహించాలి. లేదా సీనియ‌ర్ల‌ క‌నుస‌న్నల్లో అయినా జూనియ‌ర్లను ముందుకు తీసుకువెళ్లాలి. కానీ, కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకు మాత్రం నేత‌లు స‌సేమిరా అంటున్నార‌ట‌. దీంతో కొత్త నేత‌లు నిరాశ వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తమకు అవకాశమివ్వాలని…

నిజానికి టీడీపీ నేత‌లు మాట్లాడే కార్యక్రమాలు, చేసే కార్యక్రమాలు, ధ‌ర్నాలు వంటివి ఓ వ‌ర్గం మీడియాలో ప్రసారం అవుతున్నాయి. అందులోనూ ప్రధానంగా ఉన్న ఓ మీడియాలోనూ త‌ట‌స్థ వైఖ‌రి క‌నిపిస్తోంది. అటు టీడీపీతోను, ఇటు అధికార పార్టీ వైసీపీతోనూ స‌మాన డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్లకు అవ‌కాశం ద‌క్కడ‌మే క‌ష్టం. అలాంటి స‌మ‌యంలో ఛాన్స్ ఉన్న చాన‌ళ్లలో అయినా క‌నిపించాల‌నే ఉబ‌లాటం వారికి కూడా ఉంటుంది. వారు కూడా త‌మ మాట వినిపించాల‌ని వారు కోరుకోవ‌డం స‌హ‌జం.

హైలెట్ కావడం లేదు…..

అయితే పార్టీలో ప్రస్తుత ప‌రిణామాలు చూస్తే సీనియ‌ర్ల ధాటికి జూనియ‌ర్లు న‌లిగిపోతున్నారు. పార్టీలో ఇటీవ‌ల పార్లమెంట‌రీ జిల్లాల అధ్యక్షులుగా ఎంపికైన వారిలో కూడా గ‌న్ని ఆంజ‌నేయులు, ఏలూరి సాంబ‌శివ‌రావు లాంటి వారు ముగ్గురు, న‌లుగురు నేత‌లు మిన‌హా ఎవ్వరూ పార్టీ వాయిస్ వినిపించ‌డం లేదు.. వినిపించినా వారు మీడియాలో హైలెట్ కావ‌డం లేదు.

సోషల్ మీడియాలో……

దీంతో జూనియ‌ర్ నేత‌లు అంద‌రూ కూడా మెయిన్ మీడియాను ప‌క్కన పెట్టేసి.. అక్క‌డ ప‌నవ్వద‌ని గ్రహించి సోష‌ల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటోన్న ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో వారంతా కూడా సీనియ‌ర్లే కాదు మా లాంటి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వండ‌య్యా! అనే కామెంట్లను విసురుతున్నారు. వారికి కూడా ఇంత‌క‌న్నా వేరే మార్గం లేద‌నే చెప్పాలి.

Tags:    

Similar News