ఆ కథలు కంచికి చేరినట్లేనా?
పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా లో అరెస్ట్ అి జైలు కి వెళ్లారో లేదో పసుపు పార్టీలో చందమామ కథలు కోకొల్లలుగా బయటకు వచ్చేశాయి. దీనికి చంద్రబాబు [more]
పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా లో అరెస్ట్ అి జైలు కి వెళ్లారో లేదో పసుపు పార్టీలో చందమామ కథలు కోకొల్లలుగా బయటకు వచ్చేశాయి. దీనికి చంద్రబాబు [more]
పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా లో అరెస్ట్ అి జైలు కి వెళ్లారో లేదో పసుపు పార్టీలో చందమామ కథలు కోకొల్లలుగా బయటకు వచ్చేశాయి. దీనికి చంద్రబాబు పార్టీ మీడియా మరింత రంగులు అద్ది ఇంకా సెర్బియా కహానీలను మరింత రక్తి కట్టించేశాయి. జగన్ పై ఇంటర్ పోల్ రెడీ గా ఉందని రేపోమాపో ఆయన్ను అంతర్జాతీయ పోలీసులు పట్టుకుపోతారని ఒక కథనాన్ని వండివార్చారు. ఆ తరువాత మరో కథనం లో ఇటీవల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు జగన్ వెళ్లకపోవడానికి ఆయన్ను అరెస్ట్ చేస్తారనే భయమే రీజన్ అంటూ మరో కథనం. ఇక్కడితో ఆగిందా టిడిపి మీడియా అంటే అదీ లేదు. జగన్ అరెస్ట్ అవుతారు కాబట్టి ఎపి నెక్స్ట్ సిఎం వైఎస్ విజయమ్మా లేక సోదరి షర్మిళా అదీ గాక జగన్ సతీమణి వైఎస్ భారతి నా? అంటూ స్టోరీలు నడిచిపోయాయి.
నిమ్మగడ్డ విడుదలతో ….
జగన్ ఆదాాయనికి మించిన ఆస్తుల కేసుల్లో సహా నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ పై సెర్బియా సుప్రీం కోర్టు కేసు కొట్టివేసింది. ఆయన్ను విడుదల చేయడంతో హైదరాబాద్ చేరుకున్న నిమ్మగడ్డ క్వారంటైన్ పాటిస్తున్నారు. విదేశాల నుంచి రావడంతో ఆయన స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. దాంతో ఇప్పుడు టిడిపి మీడియా కొత్త కథలు సృష్ట్టించేందుకు ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది.
తాత్కాలిక బ్రేక్….
దీనికి తోడు కరోనా వైరస్ కథనాలతో మొత్తం మీడియా బిజీ అయిపోవడంతో ప్రస్తుతానికి నిమ్మగడ్డ – జగన్ లపై కహానీలకు తాత్కాలిక బ్రేక్ పడిపోయింది. టిడిపి కష్టాల్లో పడినప్పుడల్లా వైసిపి మైండ్ గేమ్ లో భాగంగా తమ సొంత మీడియా లోను సోషల్ మీడియా లలో సాగించే మసాలా వార్తలకు నిమ్మగడ్డ ప్రసాద్ ఐటెం ప్రస్తుతం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.