నిమ్మగడ్డ ఎందుకు ఊరుకుంటారు?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీచ్యుతులయ్యారు. ఆయన స్థానంలో నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ నియమితులయ్యారు. కనగరాజ్ హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీచ్యుతులయ్యారు. ఆయన స్థానంలో నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ నియమితులయ్యారు. కనగరాజ్ హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీచ్యుతులయ్యారు. ఆయన స్థానంలో నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ నియమితులయ్యారు. కనగరాజ్ హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన పదవీ బాధ్యతలను కూడా స్వీకరించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు ఏం చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. తనను రాజ్యాంగ విరుద్ధంగా పదవి నుంచి తొలగించారని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? లేక నాలుగేళ్లు అధికారంలో ఉండే వైసీపీ ప్రభుత్వంతో గొడవలెందుకని సర్దుకుపోతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
హైకోర్టును ఆశ్రయిస్తారా?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన ఎవరినీ కలిసేందుకు ఇష్టపడటం లేదు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించే యోచనలోనే ఉన్నారు. తనను గవర్నర్ పదవిలో నియమించారని, తన పదవీ కాలం పూర్తికాకముందే తొలగించడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు, రేేపు హైకోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటీషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేయనున్నట్లు తెలిసింది.
మూడేళ్ల కాలం……
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నిబంధనల ప్రకారం మరో మూడేళ్ల కాలంలో పదవిలో ఉండవచ్చు. తనకు నియామక ఉత్తర్వులు ఇచ్చిన మేరకు కాకుండా ప్రభుత్వం ఏకపక్షంగా కుదించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారంటు్నారు. పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న నిబంధనలను సవరణ చేసిన తర్వాతనే తాము ఆర్డినెన్స్ ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంతి. 243 కె (2), పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 200 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించాలంటే హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియనే చేపట్టాల్సి ఉందంటున్నారు. అందుకే ప్రభుత్వం తొలగించకుండా, పదవీకాలాన్ని కుదించి ఆయన పదవి కోల్పోయేలా చేసింది.
న్యాయ సలహా తీసుకున్న తర్వాతే….
ఇక మరో వైపు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులైైన కనగరాజన్ తొమ్మిదేళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఆయన సలహాలు ప్రభుత్వం తీసుకున్న తర్వాతనే ఈ చర్యలకు దిగిందని తెలుస్తోంది. న్యాయపరమైన ఎటువంటి చిక్కులు రాకుండానే ప్రభుత్వం తొలుత ఆర్డినెన్స్ ను గవర్నర్ చేత ఆమోదింప చేసుకుని, ఆ తర్వాత జీవోలను విడుదల చేసిందని చెబుతున్నారు. మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
.