నిమ్మగడ్డ కేసు నేడు కొలిక్కి వస్తుందా?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు ఈ నెల 10 వతేదీ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారా? లేదా? [more]

Update: 2020-06-10 00:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు ఈ నెల 10 వతేదీ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారా? లేదా? అన్నది నేడు తేలిపోనుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈరోజు కేసు విచారణ జరిగే అవకాశముంది.

హైకోర్టు తీర్పుతో…..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చే ఏడాది మార్చి నెలతో ముగియనుంది. ఆయన స్థానంలో ఏపీ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజ్ ను నియమించింది. అయితే దీనిపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టును ఆశ్రయించి…

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో ఏమాత్రం సంప్రదించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకోవడంతో ప్రభుత్వం హర్ట్ అయింది. కనీస సంప్రదింపులు జరపకుండా టీడీపీ సూచనల మేరకే నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారన్నది అధికార పార్టీ ఆరోపణ. కరోనా సమయంలో ఎన్నికలు వాయిదా వేయడం సహజమే అయినా తమను సంప్రదించకపోవడమే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకే ఆర్డినెన్స్ ద్వారా తొలగించింది. దీంతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంమంత్రిత్వ శాఖకు రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారయిందని ఇప్పటికే సీఐడీ విచారణ ప్రారంభించింది.

నేడు విచారణ…..

ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణకకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇప్పటికే దీనిపై తమ వాదనలు కూడా వినాలని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లు కేవియట్ పిటీషన్ వేశారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు ఎలాంటి మలుపులు తిరగనుందో నన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News