నిమ్మగడ్డ దెబ్బకు అన్ని పక్కకు పోయాయిగా …?

ఆంధ్రప్రదేశ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జగన్ సర్కార్ ల నడుమ యుద్ధం ప్రభుత్వానికి వరంగానే మారింది. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం [more]

Update: 2021-01-24 03:30 GMT

ఆంధ్రప్రదేశ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జగన్ సర్కార్ ల నడుమ యుద్ధం ప్రభుత్వానికి వరంగానే మారింది. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం మొదలైన ఈ యుద్ధం కారణంతో ప్రభుత్వానికి ఇటీవల ఎదురైన కొన్ని సమస్యలపై చర్చే లేకుండా పోయింది. ఎపి లో విగ్రహాల విధ్వంసం ఆ తరువాత అన్ని పార్టీల రాజకీయాలతో జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. దాంతో చంద్రబాబు గతంలో కూల్చిన ఆలయాలను పునరుద్ధరణ చేయడం, గోమాతలకు పూజలు వంటివాటితో అధికారపార్టీ డ్యామేజ్ కంట్రోల్ లో పడాలిసి వచ్చింది. దీనిపై పెను దుమారం కొనసాగుతుండగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ వైసిపికి కలిసొచ్చింది.

అందుకే పంతానికి …

సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పోరాటం వీలైనంత సాగిస్తే నష్టం కన్నా లాభమే అన్న ధోరణి సర్కార్ వ్యూహంగా కనిపిస్తుంది. రాష్ట్రం లో మత వివాదాలు, రహదారుల సమస్య వంటివి, దిగజారిన ఆర్ధిక దుస్థితి ఇలాంటి ప్రధానమైనవి మీడియా లో చర్చే లేకుండా పోతున్నాయి. ఎన్నికలు జరగొచ్చు లేకపోవొచ్చు ఈ వివాదం నడిచినంత కాలం అంతా దీనిపైనే అటెన్షన్ పెడతారు కనుక దీన్ని సాగినంత కాలం సాగదీయడమే మంచిదని సీఈసీ తో తాడో పేడో అన్న రీతిలో ముందుకు పోతుంది ప్రభుత్వం.

అందుకే ఆ లెక్కలు….

రెండు నెలల్లో రిటైర్ అయ్యే సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పక్షానా కన్నా మరో మూడేళ్ళు అధికారంలో ఉండే ప్రభుత్వం వైపే ఉద్యోగ సంఘాలు ఉంటాయి కనుక నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చుక్కలు చూపించాలన్నది వైసిపి సర్కార్ వ్యుహంగానే కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఎన్నికలు జరిగినా తమకే లాభమని, జరగకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విజయంగా లెక్కలు వేసుకుంటుంది. మరి వారి ఫార్ములా ఎంతవరకు సరైనదో కాలమే తేల్చనుంది.

Tags:    

Similar News