నిమ్మలను గ‌ట్టిగా గురి చూసి కొట్టేశారే ?

టీడీపీ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో గ‌ట్టిగా ఉన్న నాయ‌కుల‌ను జ‌గ‌న్ ఏదోలా ఆ పార్టీకి దూరం చేసుకుంటూ వ‌స్తున్నారు. గ‌న్నవ‌రంలో వంశీ, చీరాల‌లో క‌ర‌ణం బ‌ల‌రాం, [more]

Update: 2021-02-21 03:30 GMT

టీడీపీ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో గ‌ట్టిగా ఉన్న నాయ‌కుల‌ను జ‌గ‌న్ ఏదోలా ఆ పార్టీకి దూరం చేసుకుంటూ వ‌స్తున్నారు. గ‌న్నవ‌రంలో వంశీ, చీరాల‌లో క‌ర‌ణం బ‌ల‌రాం, విశాఖ‌లో వాసుప‌ల్లి గ‌ణేష్ లాంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే జ‌గ‌న్ చెంత చేరిపోయారు. ఇక ఆ పార్టీకి మిగిలిన వారిలో ఐదారుగురు మాత్రమే గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నారు. వీరిలో పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దూకుడే అసెంబ్లీలోనూ… ఇటు బ‌య‌టా వైసీపీని, జ‌గ‌న్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రామానాయుడు బ‌ల‌మైన వాయిస్ వినిపించే నేతే కాకుండా… అన్ని అంశాల‌పై స‌మ‌గ్రమైన అవ‌గాహ‌న ఉన్న వ్యక్తి కూడా. పూర్వాశ్రమంలో కాలేజ్ లెక్చర‌ర్‌గా ప‌నిచేసిన ఆయ‌నకు వ్యవ‌స్థల‌పై గ‌ట్టి ప‌ట్టుంది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఓ గ్రామంలో ఓ వార్డుపై కూడా స‌మ‌గ్రమైన అవ‌గాహ‌న రామానాయుడుకు ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో లోకేష్‌తో పాటు అదే ఫ్యామిలీకి చెందిన శ్రీ భ‌ర‌త్‌, మంత్రులు టీడీపీ మ‌హామ‌హులు జ‌గ‌న్ గాలిలో చిత్తయితే పాల‌కొల్లులో నిమ్మల రామానాయుడు వ‌రుస‌గా రెండోసారి ఏకంగా 18 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు.

పాలకొల్లులో కట్టడి చేసేందుకు….

నిమ్మల రామానాయుడు భారీ గెలుపు జ‌గ‌న్‌కు ఎంత మాత్రం రుచించ‌లేదు. దీనికి తోడు అసెంబ్లీలో పార్టీ ఉప‌నేతగా ఉండ‌డంతో పాటు పార్టీలో ఉపాధ్యక్ష ప‌ద‌వి కూడా చంద్రబాబు క‌ట్టబెట్టారు. దీంతో రామానాయుడును పాల‌కొల్లులో క‌ట్టడి చేసేందుకు జ‌గ‌న్ వేస్తోన్న ఎత్తులు… ప‌న్నుతోన్న వ్యూహాలు మామూలుగా లేవు. అయితే ఇవి ఫ‌లిస్తున్నాయ‌ని తాజా స‌ర్పంచ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఫ్రూవ్ చేస్తున్నాయి. తాజాగా జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో పాల‌కొల్లులో వైసీపీ… టీడీపీపై పూర్తి ఆధిప‌త్యం చాటింది. ఎన్నిక‌ల‌కు ముందే 15 పంచాయ‌తీలు వైసీపీకి ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక ఓవ‌రాల్‌గా య‌ల‌మంచిలి మండ‌లంలో 22 పంచాయ‌తీలు వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. పాల‌కొల్లు మండ‌లంలో 16, పోడూరు మండ‌లంలో నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న గ్రామాల వ‌ర‌కు 3 పంచాయ‌తీలు వైసీపీ సానుభూతిప‌రులు గెలుచుకున్నారు.

జ‌గ‌న్ ముందు నుంచే టార్గెట్ ?

నిమ్మల రామానాయుడు ను ఎలాగైనా వీక్ చేయాల‌ని జ‌గ‌న్ ముందు నుంచే పంతంతో ఉన్నారు. అసెంబ్లీలో రామానాయుడు వాయిస్సే గ‌ట్టిగా విన‌ప‌డ‌డంతో జ‌గ‌న్ సీఎంగా ఉండి రామానాయుడును యేడాది పాటు అసెంబ్లీ నుంచి బ‌హిష్కరించాల‌ని స్పీక‌ర్‌కు సూచించారు. ఈ ఒక్క మాటే జ‌గ‌న్ రామానాయుడును ఏ రేంజ్‌లో టార్గెట్ చేశారో చెప్పక‌నే చెపుతుంది. ఈ క్రమంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న బీసీల ఓట్లను టార్గెట్‌గా చేసుకుని శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన క‌వురు శ్రీనివాస్‌కు ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇవ్వడంతో పాటు ఆయ‌న‌కే డీసీసీబీ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. కాపుల్లో బ‌లంగా ఉన్న తూర్పు కాపుల‌ను ఆక‌ట్టుకునేందుకు అదే వ‌ర్గం నేత య‌డ్ల తాతాజీకి డీసీఎస్ఎంస్ చైర్మన్ ప‌ద‌విని క‌ట్టబెట్టారు.

పూర్తిగా పైచేయి సాధించి….

అక్కడితో ఆగ‌కుండా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ క‌వురు ఇప్పటికే రెండు కీల‌క ప‌ద‌వుల్లో ఉండ‌గానే త్వర‌లో జ‌రిగే జ‌డ్పీచైర్మన్ ఎన్నిక‌ల్లో అత‌డే పార్టీ జ‌డ్పీచైర్మన్ అభ్యర్థి అని సంకేతాలు కూడా ఇచ్చేశారు. జ‌గ‌న్ సూచ‌న‌తోనే క‌వ‌రు శ్రీనివాస్ య‌ల‌మంచిలి నుంచి జ‌డ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. ఏదేమైనా జిల్లా స్థాయిలో కీల‌క ప‌ద‌వులు అన్ని ఈ నియోజ‌క‌వ‌ర్గానికే క‌ట్టబెడుతోన్న జ‌గ‌న్‌.. గ‌త ఎన్నిక‌ల్లో నిమ్మల రామానాయుడు పై ఓడిన కాపు నేత, మాజీ ఎమ్మెల్యే బాబ్జీకి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనే వైసీపీ జోరు ముందు వెన‌క‌ప‌డ్డ రామానాయుడు త్వర‌లో జ‌రిగే మండ‌ల‌, జ‌డ్పీటీసీ, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పై చేయి సాధిస్తారా ? మ‌ళ్లీ వైసీపీకి లొంగుతారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News