అది అవసరమా జగన్
జగన్ ఏపీకి సీఎం. ఇక్కడ ప్రజల ఆత్మ గౌరవానికి ఆయన ప్రతీక. జగన్ వైసీపీ నేతగా ఎలా మాట్లాడినా ఫరవాలేదు కానీ ముఖ్యమంత్రిగా అయన ఆచీ తూచీ [more]
జగన్ ఏపీకి సీఎం. ఇక్కడ ప్రజల ఆత్మ గౌరవానికి ఆయన ప్రతీక. జగన్ వైసీపీ నేతగా ఎలా మాట్లాడినా ఫరవాలేదు కానీ ముఖ్యమంత్రిగా అయన ఆచీ తూచీ [more]
జగన్ ఏపీకి సీఎం. ఇక్కడ ప్రజల ఆత్మ గౌరవానికి ఆయన ప్రతీక. జగన్ వైసీపీ నేతగా ఎలా మాట్లాడినా ఫరవాలేదు కానీ ముఖ్యమంత్రిగా అయన ఆచీ తూచీ మాట్లాడాలి. ఏపీలో ఉన్న అయిదు కోట్ల మంది ప్రజలు మన రాష్టం, మన సత్తా ఇదీ అన్న భావనతో ఉన్నారు. ఆ సంగతి జగన్ గమనంలోకి తీసుకోవాలి. విభజన జరిగిపోయింది కాబట్టి కేసీయార్ మంచోడు అయిపోతారా అన్నది ఒక ప్రశ్న అయితే అసలు విభజన ఎవరి వల్ల జరిగిందన్న ప్రశ్న కూడా ఏపీ ప్రజలలో ఉంది. అలాగని పొరుగు రాష్ట్రాలతో మన సంబంధాలను దెబ్బ తీసుకోనవసరం లేదు. వారితో సఖ్యతగానే ఉంటూ మన స్వీయ పాలన, గౌరవాన్ని కాపాడుకోవచ్చు.
ఎక్కడో కెలికినట్లు లేదూ…:
కేసీయార్ మంచోడు అంటూ నిండు సభలో ఇప్పటికి అనేకసార్లు జగన్ పలికారు. సభలో తన ఎదురుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నాడని ఆయన అలా అంటున్నారా లేక తనని టీడీపీ ఊరికే తప్పుపడుతోందన్న ఆవేశంతో తన వాదనను సమర్దించుకోవడానికి జగన్ అలా అంటున్నారా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా కేసీయార్ ఒక ముఖ్యమంత్రి, జగన్ కూడా ఏపీకి సీఎం తెలంగాణా ప్రయోజనాలను దోచిపెట్టి కేసీయార్ ఏపీకి ఒక్క పైసా సాయం చేయరు. ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వరు. ఇది అందరికీ తెలిసిందే. తెలంగాణా ఉద్యమమే నీళ్ళు, నిధులు గురించి మొదలైంది. అలాంటపుడు కేసీయార్ ఉత్త పుణ్యానికి ఏపీకి ఎందుకు మేలు చేస్తాడు. అలా చేస్తే తెలంగాణాలో ఆయన్ని అక్కడ రాజకీయం బతకనిస్తుందా. ఈ లాజిక్ వైసీపీ నేతలు, జగన్ మిస్ కావడమే ఇక్కడ బాధాకరం. మరోటి ఏంటంటే కేసీయార్ని పొగిడి విభజన నాటి గాయాలను కెలకడం ఎందుకన్నది కూడా జనాల్లో వినిపిస్తున్న మాట.
ఏపీ ఒక్కటిగా నిలవాలి…..
ఇక ఎన్ని గొడవలు ఉన్న మరెన్ని రాజకీయాలు ఉన్నా ఏపీ వరకూ పరిమితం చేసుకోవాలి. చంద్రబాబు వైరి పక్షమే అయినా ఆయనా జగన్ ఇద్దరూ అధికారానికి శాశ్వతం కాదు, ఈ నేల, ఏపీ శాశ్వతం, ఆ విధంగా పెద్ద మనసుతో ఆలోచన చేసి ఏపీ ప్రయోజనాలు జగన్ కాపాడాలి. మరో విషయం ఇక్కడ ఉంది. కేసీయార్ మంచివాడు అంటూ జగన్ సర్టిఫికేట్ ఇచ్చినా ఆయన్ని ద్వేషించేవారు ఏపీలో ద్వేషిస్తారు, ప్రేమించే వారు ప్రేమిస్తారు. అందువల్ల ఆ పొగడ్తలు పక్కన పీటి ఏపీకి ఏది గట్టి మేలో జగన్ ఆలోచన చేస్తే బాగుంటుంది. కేసీయార్ మంచి వాడు అనడం వల్ల అది అంతిమంగా వైసీపీకి కూడా రాజకీయంగా చేటు తెచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఈ అంశాన్ని ఎంతలా రచ్చ చెయాలో టీడీపీ పక్కా ప్లాన్ వేసుకుని ముందుకు సాగుతోంది. అందువల్ల అఖిలపక్షం వేసి అందరి అభిప్రాయంతో నీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ సర్కార్ ముందుకు వెళ్ళడం మంచిది.