ఈశాన్యంలో కరోనా బరువు తక్కువ….కారణాలేంటంటే?

దేశచిత్రపటాన్ని పరిశీలించినప్పుడు ఈశాన్య భారతం… దేశానికి మారుముాల, సుదూరంగా విసిరివేసినట్లు కనపడుతుంది. అభివృద్ధికి దుారంగా ఉంటుంది పేదరికం, అసమానతలు, తీవ్రవాదం ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తుంటాయి. అదే సమయంలో [more]

Update: 2020-05-04 16:30 GMT

దేశచిత్రపటాన్ని పరిశీలించినప్పుడు ఈశాన్య భారతం… దేశానికి మారుముాల, సుదూరంగా విసిరివేసినట్లు కనపడుతుంది. అభివృద్ధికి దుారంగా ఉంటుంది పేదరికం, అసమానతలు, తీవ్రవాదం ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తుంటాయి. అదే సమయంలో కొన్ని ప్రత్యేకతలుా ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి ఈశాన్యభారతం మారుపేరుగా నిలుస్తోంది. ఆ ప్రత్యేకత ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కాపాడుతోంది. యావత్ భారతావని కరోనాతో కుదేలవుతుండగా ఒక ఈశాన్య భారత్ మాత్రమే ఈ మహమ్మారిని నిలువరిస్తోంది. ఆ ప్రాంతంలో నమెాదవుతున్న కేసులు, మరణాలు, చాలా తక్కువగా ఉంటున్నాయి. మెుత్తం ఈశాన్యభారత్ లో కేసులు 33 మాత్రమే కావడం గమనార్హం.

సెవెన్ సిస్టర్స్……

అసోం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరమ్ లతో కలిపి ఏడు రాష్ట్రాలతో కుాడిన ఈ ప్రాంతాన్ని ‘సెవెన్ సిస్టర్స్’ గా పిలిచేవారు. కాలక్రమంలో సిక్కిం కుాడా ఇందులో భాగమైంది. ఈశాన్యభారతంలో జనాభా పరంగా అసోం అతిపెద్ద రాష్ర్టం. ఈ రాష్ట్రం యావత్ ఈశాన్యభారతానికి ముఖద్యారంగా ఉంటుంది. వైశాల్యపరంగా చుాస్తే అరుణాచల్ ప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం. ఇది చైనా సరిహద్దుల్లో ఉంటుంది. అసోం నుంచి విడిపోయి మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, వంటి రాష్ట్రాలు ఆవిర్భవించాయి. తీవ్రవాద సమస్య లేకపోతే ఈప్రాంతం ఎప్పుడో అభివృద్ధి సాధించేది. సాధారణంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, నగరాలు, వలసలు ఉన్నచోట కరోనా వ్యాప్తి ఉంటుంది. ఈశాన్య భారత్ లో ఇలాంటి పద్ధతి లేనందున కరోనా వ్యాప్తి, ఉద్ధృతి ఒకింత తక్కువగా ఉంది.

పన్నెండు జిల్లాల్లోనే….

దాదానగర్ హవేలి, డబ్ల్యూ డామన్ లక్షద్వీప్, తదితర కేంద్రపాలిత ప్రాంతాల్లోనుా కరోనా విస్తృతి కాలేదు. ఇక్కడ జన సాంద్రత తక్కువగా ఉండటం ఇందుకు కారణం. అసోంలోని 33 జిల్లాలకు గాను 12 జిల్లాలకు కరోనా విస్తరించింది. ఈ 12 జిల్లాల్లో 28 కేసులు నమెాదయ్యాయి. మణిపూర్, త్రిపురల్లో రెండు చొప్పున పాజిటివ్ కేసులు వెలుగుచుాశాయి. త్రిపుర బంగ్లాదేశ్ సరిహద్దుల్లో, మణిపూర్, మయన్మార్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలండ్, మిజోరమ్ ల్లో ఒక్క కేసు నమెాదు కాక పోవడం గమనార్హం. దేశంలో కరోనా కేసు వెలుగుచుాసిన చివరి రాష్ట్రం నాగాలాండ్ మాత్రమే కావడం గమనార్హం.

మర్కజ్ నుంచి వచ్చిన వారితో…

ఢిల్లి మర్కజ్ యత్రకు వెళ్ళివచ్చిన వారి ద్వారా అసోంలో కరోనా వెలుగుచుాసింది. రాష్ట్రంలోని గోల్పర జోన్ లో తొలి కరోనా కేసు నమెాదైంది. ఆ తర్వాత వివిధ ప్రాంతాలు తబ్లిగి జమాత్ నాయకుడిపై పోలిసులు కేసు నమెాదు చేశారు. అసోం ద్వారానే పొరుగున ఉన్న మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లకు కరోనా విస్తరించింది. తమ రాష్ట్రంలో 2 కేసులు వెలుగు చుాశాయని, మరికొందరిని క్వారంటైన్ లో ఉంచామని, వ్యాధి విస్తరించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు, అప్రమత్తంగా ఉంటున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేంద్రసింగ్ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ లో గుర్తించిన కరోనా బాధితుడిని క్వారంటైన్ కు తరలించారు. రాష్ట్రంలోని ‘తేజ్’ జిల్లాలో కరోనా కేసు నమెాదైందని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్రంలో 28 కేసులు నమెాదైన మాట వాస్తవమేనని, సౌదీ అరేబియా నుండి ఓ వ్యక్తి ద్వారా వ్యాప్తి పెరిగినట్లు అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. దక్షణ త్రిపురలోని ఉదమ్ పూర్ ప్రాంతంలో ఒక కరోనా కేసు నమెాదైందని, వ్యాధి విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం పకడ్మందీగా వ్యవహరిస్తుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ వెల్లడించారు.

కరోనాను ఎదుర్కొనేందుకు…..

కరోనాను ఎదుర్కొంనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఈశాన్య భారత్ లో కరోనా కట్టడిలో అసోం పాత్ర చాలా కీలకం. ఈ రాష్ట్రంలో ఆరు రాష్ట్రాలు 2,616 కిలో మీటర్ల సరిహద్దులు కలిగి ఉన్నాయి. నాగాలాండ్ 12.1, అరుణాచల్ ప్రదేశ్ 804.1, మణిపూర్ 204.1, మిజోరం 164.6, త్రిపుర 46.3, మేఘాలయ 884.9 కిలో మీటర్ల సరిహద్దును అసోం కలిగి ఉంది. రాష్ట్రాల సరిహద్దులను ముాసివేయడంద్వారా కరోనాను కొంతవరకు నియంత్రించ వచ్చన్న ఉద్దేశంతో ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. మెుత్తం ఈశాన్య రాష్ట్రాల జనాభా, దాదాపు నాలుగురెట్లు. ఇందులో అసోం జనాభా రమారమి ముాడుకోట్లు. అందుకే మెుత్తం ఈశాన్య భారత్ లో ఈ రాష్ట్రంలో కరోనా కేసులో 28 న నమెాదయ్యాయి. అరుణాచల్ ప్రదేశా జనాభా 12.6 లక్షలు, విస్తీర్ణం పెద్దది. అందువల్లే ఇక్కడ కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది. మణిపూర్ ప్రభుత్వం కుాడా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర వైద్యమంత్రి జయంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈశాన్య భారత్ లో పరిస్ధితి ఒకింత ఊరట కలిగించే విధంగా ఉంది. ఇదే పరిస్ధితి కొనసాగాలన్నది అందరి ఆకాంక్ష.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News