Pallam raju : ఏ పార్టీలో చేరి పోటీ చేస్తారో?

చూస్తుండగానే పదేళ్ల కాలం గడిచిపోయింది. రాష్ట్ర విభజన కారణంగా ముఖ్యంగా ఏపీలో అనేక మంది రాజకీయ నేతలు సన్యాసం పుచ్చుకున్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ లో అనేక [more]

Update: 2021-10-23 13:30 GMT

చూస్తుండగానే పదేళ్ల కాలం గడిచిపోయింది. రాష్ట్ర విభజన కారణంగా ముఖ్యంగా ఏపీలో అనేక మంది రాజకీయ నేతలు సన్యాసం పుచ్చుకున్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించిన నేతలు సయితం విభజన తర్వాత ఏ పార్టీలో చేరలేక, కాంగ్రెస్ లో ఉన్నా ఫలితంలేక మౌనంగా ఉండిపోయారు. అతి కొద్ది మంది నేతలు మాత్రమే పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఇక 2024 నాటికి కాంగ్రెస్ నేతలు సయితం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు.

కాంగ్రెస్ లో సుదీర్ఘకాలంగా…

అందులో పల్లంరాజు ఒకరు. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వరసగా రెండుసార్లు 2004, 2009 లో విజయం సాధించారు. 1989లో నూ ఆయన పార్లమెటు సభ్యుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. కాపు సామాజికవర్గానికి చెందిన పల్లంరాజుకు నిజాయితీ పరుడని పేరుంది. ఆయన కుటుంబం సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉంది. విదేశాల్లో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన పల్లంరాజును రెండుసార్లు కాకినాడ ప్రజలు పట్టం కట్టారు.

పదేళ్ల నుంచి…

పదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న పల్లంరాజును వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆహ్వానించాయి. ఇటు టీడీపీ, అటు జనసేనల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందాయి. టీడీపీ, జనసేనల్లో ఉన్న చెలమలశెట్టి సునీల్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. కాకినాడ పార్లమెంటుకు పోటీ చేయడానికి టీడీపీకి సరైన అభ్యర్థులు లేరు. తోట నరసింహం కుటుంబం కూడా పార్టీని వీడింది. దీంతో టీడీపీలో చేరాలని పల్లంరాజుకు ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది.

టీడీపీ, జనసేనల్లో….

జనసేన కూడా ఇదే ఆలోచన చేస్తుంది. రాజకీయంగా మంచి పేరున్న ఆ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకోవాలని పవన్ కల్యాణ‌్ భావిస్తున్నారు. స్వయంగా పవన్ కల్యాణ్ పల్లంరాజును కలవాలని కూడా భావిస్తున్నారు. పల్లంరాజు కాంగ్రెస్ లో ఉండలేరు. డీఎల్ రవీంద్రారెడ్డి తరహాలోనే ఆయన కూడా కాంగ్రెస్ ను వీడి ఏదో ఒక పార్టీలో చేరి పోట ీ చేయాల్సి ఉంటుంది. పోటీకి రెడీయే..మరి ఏ పార్టీ నుంచి అన్నది మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

Tags:    

Similar News