Congress : నమ్మకద్రోహులకు మళ్లీ నీడ కల్పిస్తారా?

కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అయితే పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్లిన నేతలను తిరిగి తీసుకోవడానికి పార్టీ సీనియర్లు అంగీకరించడం లేదు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే [more]

Update: 2021-10-23 09:30 GMT

కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అయితే పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్లిన నేతలను తిరిగి తీసుకోవడానికి పార్టీ సీనియర్లు అంగీకరించడం లేదు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీ నుంచి వలసలు ఆగవన్నది కొందరి వాదన. ఇది కూడా నిజమే. ఇప్పుడు ధర్మపురి శ్రీనివాస్ విషయంలో ఇదే చర్చ నడుస్తుంది. ధర్మపురి శ్రీనివాస్ తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సంకేతాలు కూడా పంపుతున్నారు.

నమ్మించి మోసం చేసి…

ధర్మపురి శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కాదని అధికార పార్టీలోకి వెళ్లిపోయారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులను ఆయన అనుభవించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడ రాజ్యసభ పదవిని సంపాదించుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో పొగపెట్టడంతో పార్టీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాజ్యసభ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన టీఆర్ఎస్ ను వీడే అవకాశాలున్నాయి. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతుదారుగా ఉన్నారు.

పార్టీలోకి రావాలని….

అయితే ఇటీవల రేవంత్ రెడ్డి డీఎస్ ను కలసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కానీ దీనిని కొందరు నేతలు తప్పుపడుతున్నారు. అవకాశవాదులకు మరోసారి ఛాన్స్ ఇవ్వవద్దని హైకమాండ్ కు కూడా ఫిర్యాదు చేశారు. డీఎస్ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదని, చేర్చుకుని అనవసర తలనొప్పులు తెచ్చుకోవద్దని కూడా కొందరు నేతలు సూచిస్తున్నారు. డీఎస్ కుమారుడు అరవింద్ బీజేపీలో ఉండటాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు.

వద్దంటున్న నేతలు…..

డీఎస్ కు అవకాశమిస్తే పార్టీలో వెళ్లి అక్కడ ప్రయోజనాలు పొందని వారు తిరిగి వచ్చే అవకాశముందంటున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికే అవకాశాలు కల్పించాలని, జంప్ చేసిన వారిని తిరిగి చేర్చుకోవద్దని ఎక్కువ మంది నేతలు సూచిస్తున్నారు. దీంతో డీఎస్ కాంగ్రెస్ లో చేరడం కష్టమే. అయితే మాజీ ఎంపీ మధుయాష్కి, రేవంత్ రెడ్డిలు డీఎస్ రాకను స్వాగతిస్తున్నారు. మిగిలిన నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరి అధిష్టానం నిర్ణయంపైనే కాంగ్రెస్ లో డీఎస్ చేరిక ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News