పవన్ సుదీర్ఘ వ్యూహం … ?
దెబ్బ తగిలితే కానీ తెలియదు అంటారు. ఇప్పుడు జనసేనాని కి చాలా దెబ్బలే తగిలాయి తగులుతున్నాయి. దాంతో ఆయన ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కునే ప్రయత్నాలు మొదలు [more]
దెబ్బ తగిలితే కానీ తెలియదు అంటారు. ఇప్పుడు జనసేనాని కి చాలా దెబ్బలే తగిలాయి తగులుతున్నాయి. దాంతో ఆయన ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కునే ప్రయత్నాలు మొదలు [more]
దెబ్బ తగిలితే కానీ తెలియదు అంటారు. ఇప్పుడు జనసేనాని కి చాలా దెబ్బలే తగిలాయి తగులుతున్నాయి. దాంతో ఆయన ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. జనసేన ఒప్పుకున్నా లేకపోయినా కాపు ఓటు బ్యాంక్ ను గత ఎన్నికల్లో బలంగా కోల్పోయింది ఆ పార్టీ. ఆ వర్గం ఓట్ల వర్షం ఎలాగూ తమకే అన్న ధీమా పవన్ కల్యాణ్ పార్టీని కొంప ముంచింది.
తొలి నుంచి అంతే ….
మొదటి నుంచి ఆయన కాపుల సమస్యలపై సూటిగా ప్రశ్నించకపోవడం రిజర్వేషన్ల అంశంపై సాగిన ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం గెలిచే పార్టీ కాకపోవడంతో పవన్ వైపు చివరి వరకు నడిచిన కాపు సామాజికవర్గం పోలింగ్ లో మాత్రం వైసిపి కే ఛాన్స్ ఇచ్చేసింది. ఎన్నికల రిజల్ట్స్ తో బాటు కాపు సామాజికవర్గాలు బలంగా ఉన్న చోటా జనసేన గల్లంతు అయిన తీరు చెప్పకనే చెప్పింది. దాంతో తప్పు దిద్దుకునే అవకాశం కోసం జనసేనాని ఎదురు చూస్తున్నారు. అది రానేవచ్చింది. వైసిపి కాపు నేస్తం పేరిట ఆ సామాజికవర్గం మహిళలకు నేరుగా అకౌంట్ల లో డబ్బు జమ చేసేసింది.
స్క్రీన్ పైకి రాక తప్పలేదు …
దాంతో పవన్ స్క్రీన్ పైకి వచ్చేశారు. రిజర్వేషన్ల సంగతి మాటేమిటి అని ప్రశ్నించారు. ఇంకా పలు ప్రశ్నలు లేవనెత్తారు. కరోనా వచ్చాకా రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటున్న పవర్ స్టార్ కాపు నేస్తం ఎపి ముఖ్యమంత్రి జగన్ మొదలు పెట్టాకా ఇక తన పాత్ర వచ్చేసిందని గుర్తించారు. వెంటనే వైసిపి పై పవన్ కల్యాణ్ యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు ఈ వార్ ఇప్పట్లో చల్లారేలా లేదు. సుదీర్ఘ కార్యాచరణతోనే కాపులకు రిజర్వేషన్ అంశం ఇప్పుడు ఎపి లో హాట్ టాపిక్ కానుంది. అయితే పవన్ కల్యాణ్ ఎత్తుగడ గమనించిన వైసిపి ఎదురుదాడి మొదలు పెట్టింది. కాపునేతలు కురసాల కన్నబాబు, ఆమంచి కృష్ణ మోహన్, తోట త్రిమూర్తులు, జక్కంపూడి రాజా లతో ముప్పేట దాడి మొదలు పెట్టింది. దీనిపై జనసేన ఘాటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. వీరి యుద్ధం ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.