వారి కంట్రోల్ లోకి వెళ్లిపోయారా?
పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటివరకు ఒక పార్టీ అధినేత. ఆయన చెప్పిందే వేదం. చేసిందే కార్యం. దీనిని పార్టీలో ప్రశ్నించడానికి ఏ ఒక్కరు సాహసించరు. అలా చేసేందుకు [more]
పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటివరకు ఒక పార్టీ అధినేత. ఆయన చెప్పిందే వేదం. చేసిందే కార్యం. దీనిని పార్టీలో ప్రశ్నించడానికి ఏ ఒక్కరు సాహసించరు. అలా చేసేందుకు [more]
పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటివరకు ఒక పార్టీ అధినేత. ఆయన చెప్పిందే వేదం. చేసిందే కార్యం. దీనిని పార్టీలో ప్రశ్నించడానికి ఏ ఒక్కరు సాహసించరు. అలా చేసేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే వారు పార్టీ వీడి వెళ్లిపోవాలిసిందే. నిన్నటివరకు నేనే రాజు నేనే మంత్రిగా వున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపి తో పొత్తు తరువాత నోరు కట్టుకోవాలిసిన పరిస్థితి ఏర్పడింది. ఏది కూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అసెంబ్లీలో కీలక బిల్లుల ఆమోదం సందర్భంగా పవన్ ఎంతో ఆవేశంతో ఊగిపోయారు. తనను పోలీసులు నిర్బంధించిన తీరును తప్పుపడుతూ ఆగ్రహంగా మాట్లాడినా, తనను కలిసిన అమరావతి రైతులతో మాట్లాడేటప్పుడు కూడా స్వేచ్ఛగా తన వాణి వినిపించలేని వాతావరణం కనిపించింది.
బిజెపి తో చర్చించే …
పవన్ తదుపరి కార్యాచరణ ఏమిటంటూ మీడియా అడిగినప్పుడు నే బిజెపి తో చర్చించి చెబుతా అని వ్యాఖ్యానించారు. అలాగే అమరావతి రైతులతో మాట్లాడుతూ పలు హామీలు వారికి ఇచ్చినా బిజెపి తో జరిగే సమన్వయ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాకే భవిష్యత్తు ఏమిటో వెల్లడిస్తా అని ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరుగుతాయని చెప్పలేనంటూ తన నిస్సహాయత వ్యక్తం చేసేశారు. అనేక హామీలు ఒక పక్క చెబుతూనే బిజెపి ఒకే అంటే కానీ తానేమి చేయలేనంటూ చెప్పడం గమనార్హం. పొత్తు తరువాత పవన్ కల్యాణ్ గమనం పరిశీలిస్తే ఆయన పూర్తిగా స్వతంత్రతను కోల్పోయి జాతీయ పార్టీ ఆదేశాల మేరకే పనిచేయాలిసిన పరిస్థితిని చెప్పకనే చెప్పినట్లే అయ్యింది.నా పరిధులు పరిమితులతో పోరాడతా అంటూ చేసిన పవన్ కల్యాణ‌్ వ్యాఖ్యలు ఆయన ఇక కమలం కంట్రోల్ దాటి వెళ్ళలేనని తేల్చేశాయి. ఇప్పుడే ఇలాంటి వాతావరణం ఉంటే రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ జనసేన కీలక నిర్ణయాలపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశాలు లేవని స్పష్టం అవుతున్నాయి.
భిన్నాభిప్రాయాలతో మరింత గందరగోళం …
రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ అంశం అని ఇప్పటికే జివిఎల్ నరసింహారావు వంటివారు సూటిగా చెప్పేశారు. టిడిపి పెద్దన్న పాత్ర పోషించాలని చెబుతున్నారని మరి ఆ పార్టీ వారు దద్దమ్మ పాత్ర వహిస్తారా అంటూ కడిగేశారు. ఒక పక్క జివిఎల్ గతంలో చంద్రబాబు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ వైసిపి నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉంటే పవన్ కల్యాణ్ మాత్రం పూర్తిగా వైసిపి ని దాని అధినేతపై నిప్పులు చెరుగుతున్నారు. టిడిపి ని మాత్రం నామమాత్రంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనిస్తే రెండు పార్టీల నడుమ సమన్వయం ఎంతవరకు సాధ్యం అవుతుందనే ప్రశ్నలు లేవనెత్తుతుంది.