గేర్ మార్చిన పవన్

జనసేన అధినేత తాజా కామెంట్స్ హాట్ హాట్ గా చర్చనీయం అవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన జగన్ సర్కార్ కి వందరోజుల సమయం ఇస్తున్నామని గతంలో ప్రకటించిన పవన్ [more]

Update: 2019-08-17 15:30 GMT

జనసేన అధినేత తాజా కామెంట్స్ హాట్ హాట్ గా చర్చనీయం అవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన జగన్ సర్కార్ కి వందరోజుల సమయం ఇస్తున్నామని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ తమ పార్టీ వారిపై కేసులు పెడుతున్నారంటూ రాజోలు ఎమ్యెల్యే ఉదంతం చెప్పి ఇక విమర్శలు, ఆరోపణల యుద్ధానికి తెరతీశారు. తాము పెట్టుకున్న నియమాన్ని ప్రభుత్వమే సడలించేలా చేసిందని ఆరోపించారు. అంతేకాదు జగన్ బాబాయి వైఎస్ వివేక హత్య కేసు లో దోషుల పై చర్యలేవని, నెల్లూరు ఎమ్యెల్యే కోటంరెడ్డి పై ఎలాంటి చర్య తీసుకున్నారంటూ విరుచుకుపడి జనసేన లో జోష్ పెంచారు పవన్. నిన్నమొన్నటివరకు పార్టీ సమీక్ష సమావేశాల్లో చప్పగా ప్రసంగించిన జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు మీడియా అటెన్షన్ తనపై ఉండేలా గేర్ మార్చేశారు.

ఫ్రస్టేషన్ నుంచి బయటపడలేదా ….

పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ పరిశీలిస్తే ఆయన ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలనుంచి ఇంకా బయటపడలేకపోతున్నట్లు స్పష్టం అవుతుంది. పదేపదే పార్టీ ఘోరఓటమికి ఒక్కోచోటా ఒక్కోలా స్పందిస్తూ క్యాడర్ లో గందరగోళానికి అధినేతే తెరతీస్తున్నారు. గతంలో భీమవరంలో 100 కోట్లరూపాయలు పైనే కుమ్మరించి తనను ఓడించేశారని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఓటుకు రెండువేల రూపాయలు తీసుకుని జనసేనను ఓడించారని వైసిపిని గెలిపించారని ఆరోపించి పరాజయ పరాభవం తన మది నుంచి బయటకు పోలేదని చెప్పక చెప్పేశారు పవన్ కల్యాణ్ . ఇక అభిమానులపైనా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పవన్ కల్యాణ్ . ఈలలు తప్పట్లు కోరుకుని ఉంటే సినిమాల్లో ఉండేవాడినని వారిని సుతిమెత్తగా మందలించారు. అంతేకాదు క్రమశిక్షణ లేని సేన వల్లే ఇంత పరాజయం సంభవించిందని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్ . ఇలా రోజుకోరకంగా జనసేన ఓటమి ని పవన్ కల్యాణ్ విశ్లేషించడం తన డై హార్డ్ ఫ్యాన్స్ పై కూడా చిర్రుబురులు ఆడటం పార్టీకి ఈమేరకు మైలేజ్ పెంచుతుందో చూడాలి.

క్లారిటీ ఇంకా లేదా …?

ఎన్నికలు పూర్తి అయ్యి ఫలితాలు వచ్చి దాదాపు మూడు నెలలు సమీపిస్తోంది. ఓటమి ఘోరంగా ఉండటంతో బాధ ఉండటం సహజమే. అయితే అటు టిడిపి వంటి అపార అనుభవం ఉన్న పార్టీకే ఎందుకు ఓడిపోయామో అని నేటికీ ఆపార్టీ అధినేత వాపోతూ వస్తున్నారు. ఇక కొత్తగా ఎన్నికల్లో పుట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం క్లారిటీ ఎందుకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రతి పార్టీకి ఎందుకు ఓడింది పూర్తిగా తెలుసు. కానీ అది జీర్ణించుకోవడానికి ఇంకా సమయం పట్టేలాగే వుంది. అది ఎంతకాలం అన్నది రాబోయే రోజులే తేల్చాలి. ఓటమిని విజయంగా మలచుకోవడం లో ఎన్నో అడ్డంకులు ఎదురౌతాయి. పవన్ కల్యాణ్ వంటి దూకుడు గా వుండే నేతలు ఆ సమస్యలు పరిష్కరించుకునే ఆలోచన మాని అయిపోయిన పెళ్ళికి బాజాలు వాయిస్తూ కూర్చునే కన్నా పటిష్ట కార్యాచరణ తో చెయ్యాలిసింది చేస్తే మంచిదన్నది రాజకీయ విశ్లేషకుల సూచన. లేని పక్షంలో మరికొన్ని చేదు అనుభవాలు చవిచూడాలిసిందే అని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News