పవన్ తోడుగా ఉంటే బాబు ఇక్కడ దున్నేస్తారా… ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు తానుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవకపోయినా టీడీపీని 2014 ఎన్నికల్లో గెలిపించడానికి బాగా ఉపయోగపడ్డారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు [more]
;
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు తానుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవకపోయినా టీడీపీని 2014 ఎన్నికల్లో గెలిపించడానికి బాగా ఉపయోగపడ్డారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు [more]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు తానుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవకపోయినా టీడీపీని 2014 ఎన్నికల్లో గెలిపించడానికి బాగా ఉపయోగపడ్డారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు గెలిచేందుకు సరిపడా ఓట్లు రాకపోయినా మరో పార్టీకి సపోర్ట్ చేస్తే మాత్రం కచ్చితంగా గెలిచేందుకు వీలు పడుతుంది. ఈ విషయం 2019 ఎన్నికల్లో క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవకపోయినా గెలిపిస్తాడన్న క్లారిటీ రావడంతో పవన్‌ను తిప్పుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే బీజేపీ పవన్‌తో పొత్తు పెట్టుకుంది. ఇక ఇప్పుడు చంద్రబాబు రాజకీయ మంత్రాంగం కూడా పవన్ కళ్యాణ్ మీదే ఉంది. ఈ విషయాన్ని టీడీపీ నేతలు కూడా ధృవీకరిస్తున్నారు. కేవలం అయిదు జిల్లాల కోసమే బాబు పవన్ కోసం పరితపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనుక తమ జట్టులోకి వస్తే కచ్చితంగా అటు ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలు, ఇటు ఉభయ గోదావారి జిల్లాలను సులువుగా గెలుచుకోవచ్చు అన్న ఆలోచనలు టీడీపీ అధిష్టానంకే కాదు.. అటు పార్టీ నేతలకు కూడా ఉంది.
గోదావరి జిల్లాల్లో….
ఈ రెండు జిల్లాల్లో కలుపుకుని మొత్తం 68 సీట్లు ఉన్నాయి. ఇందులో ఓ యాభై సీట్లు గెలుచుకుంటే చాలు వచ్చేది కచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్ పార్టీకి 2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాలో ఓట్లు బాగా వచ్చాయి. అక్కడ టీడీపీ దారుణంగా ఓడిపోవడానికి కారణం పవన్ కి పడిన ఓట్లే అని చెప్పుకోవాలి. అవి కూడా టీడీపీకి యాడ్ అయితే వైసీపీ రెండవ ప్లేస్ లోనే ఉంటుంది. జనసేన గెలుచుకున్న ఏకైక సీటు రాజోలు సైతం తూర్పు గోదావరిలోనే ఉంది. ఈ రెండు జిల్లాల్లో జనసేన + టీడీపీ ఓట్లు కలిపితే గత ఎన్నికల్లోనే చెరిసగం సీట్లు వచ్చినట్లయ్యింది.
ఉత్తరాంధ్రలోనూ….
ఇక ఉత్తరాంధ్రా జిల్లాలలో చూసుకున్నా ఇదే సీన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ బలం విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉంది. విశాఖ ఎంపీ సీటే తీసుకుంటే వైసీపీ ఎంపీ ఎంవీసీ సత్యనారాయణ గెలిచింది కేవలం మూడు వేల ఓట్ల తేడాతో మాత్రమే. అదే జనసేన తరఫున ఎంపీగా నిలబడిన అభ్యర్ధి జేడీ లక్ష్మీనారాయణకు వచ్చిన ఓట్లు రెండు లక్షల డెబ్బై అయిదు వేల ఓట్లు. ఈ ఓట్లలో మెజారిటీ టీడీపీ నుంచి చీల్చినవే. అనకాపల్లి, అమలాపురం, కాకినాడ ఎంపీ సీట్లు సైతం ఇలాగే టీడీపీ నుంచి వైసీపీ ఖాతాలో పడ్డాయి.
ఇద్దరూ కలిస్తే….?
మరి ఇవి రేపటి ఎన్నికల్లో కలసివస్తే ఉత్తరాంధ్రలో విశాఖ ఎంపీ సీటే కాదు, ఈ జిల్లాలోని అనేక అసెంబ్లీ సీట్లను కూడా టీడీపీ గెలుచుకోవడం ఖాయం. అదే విధంగా విజయనగరం, శ్రీకాకుళంలో కూడా కాపులు టీడీపీ వైపు టర్న్ కావాలి అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ వైపుగా ఉండాలి. ఈ రెండు పార్టీలు కలిస్తే ఇక్కడ 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచిన వైసీపీకి 2024 ఎన్నికల్లో చుక్కలు కనిపించడం ఖాయమనే అంటున్నారు. ఇక జనసేన టీడీపీతో పొత్తులో పోటీ చేస్తే మరీ ఘోరంగా ఒకటి అరా సీట్లు కాకుండా గౌరవప్రదంగానే సీట్లు గెలవడం పక్కా. మరి చూడాలి ఈ పొత్తు ఎపుడు పొడుస్తుందో.