Pawan kalyan : కాపు కార్డు పవన్ కు ఛత్రంగా మారనుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాస్తవంలోకి వచ్చారు. కులం మద్దతు లేకుండా రాజకీయాల్లో ముందుకు వెళ్లలేమని గ్రహించారు. అందుకే ఇప్పుడు కాపు కులాన్ని దువ్వేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాస్తవంలోకి వచ్చారు. కులం మద్దతు లేకుండా రాజకీయాల్లో ముందుకు వెళ్లలేమని గ్రహించారు. అందుకే ఇప్పుడు కాపు కులాన్ని దువ్వేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాస్తవంలోకి వచ్చారు. కులం మద్దతు లేకుండా రాజకీయాల్లో ముందుకు వెళ్లలేమని గ్రహించారు. అందుకే ఇప్పుడు కాపు కులాన్ని దువ్వేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మిగిలిన కులాల కంటే వీరి ఓట్ల శాతమే ఎక్కువ. నిన్న మొన్నటి వరకూ తాను చెప్పకపోయినా కాపు సామాజికవర్గం తన వెంటే ఉంటుందని పవన్ కల్యాణ్ భావించారు.
గత ఎన్నికల్లో….
కానీ గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం పవన్ కల్యాణ్ వెంట లేదు. బలంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోనే జనసేన పార్టీకి ఒక్క సీటు దక్కింది. భీమవరంలోనూ, గాజువాకలోనూ పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీీ నుంచి పోటీ చేసిన కాపు సామాజికవర్గం నేతలకు ఆ సామాజికవర్గం అండగా నిలబడింది. దీనిని గుర్తించిన పవన్ కల్యాణ్ తనను కాపు సామాజిక వర్గం నేతగా గుర్తించాలని ఆ సామాజికవర్గాన్ని ప్రాధేయపడినట్లు కన్పించింది.
వీరిద్దరినే గుర్తించి….
నిజానికి కాపు సామాజికవర్గం తమ నేతలుగా ఇద్దరినే ఇప్పటివరకూ గుర్తించింది. ఒకటి వంగవీటి మోహనరంగా. ఇప్పటికీ రంగాకు ఆ సామాజికవర్గం రుణపడి ఉందనే చెప్పాలి. ఎందుకంటే రంగా హత్య తర్వాతనే కాపు సామాజికవర్గంలో ఐక్యత వచ్చింది. ఇక రెండో నేత ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న ముద్రగడ పద్మనాభాన్ని కాపు సామాజికవర్గం నమ్మింది. అయితే ఆయన ఇటీవల దానిని వదిలేశారు. అంతే తప్ప ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవిని సయితం కాపు సామాజిక వర్గం నమ్మలేదు. ఆయనను నటుడిగానే చూసింది తప్ప.. నాయకుడిగా గుర్తించలేదు.
కాపులు దగ్గరయితే…?
ఇప్పుడు పవన్ కల్యాణ్ పరిస్థిితి కూడా అదే మాదిరి ఉండనుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాపులను బహిరంగంగా దగ్గరకు తీసుకునేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తే మరో బలమైన బీసీ సామాజికవర్గం దూరమయ్యే అవకాశముంది. ఇక కాపులు ఒక పార్టీకి మద్దతిస్తే కాపులను వ్యతిరేకించే మిగిలిన కులాలు కూడా వారికి వ్యతిరేకమవుతాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు, శెట్టిబలిజలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాపులతో కలసి వెళ్లేందుకు ఉప కులాలు ఎన్నడూ అంగీకరించవన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ ఎత్తుగడ పవన్ కల్యాణ్ కు ఏ రకమైన మేలు చేస్తుందన్నది కాలమే సమాధానం చెప్పాలి.