Pawan kalyan : కల్యాణ్ చెబుతుంది కరెక్టేగా?

అనుకున్నట్లే జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. బీజేపీ వాళ్లు ఆహ్వానించారో లేదో? ఈయన మాత్రం అక్కడకు రాకుండానే [more]

Update: 2021-10-27 06:30 GMT

అనుకున్నట్లే జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. బీజేపీ వాళ్లు ఆహ్వానించారో లేదో? ఈయన మాత్రం అక్కడకు రాకుండానే ఎన్నికలను ముగించారు. ఇక బీజేపీ బద్వేలు లో ఒంటరి పోరాటం చేసిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ బద్వేలు రాకపోవడానికి జనసేన పార్టీ చెబుతున్న కారణాలు సహేతుకంగా ఉన్నప్పటికీ, మిత్రపక్షాన్ని అలా గాలికి వదిలేయడమేంటన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారం…

బద్వేలులో ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. బీజేపీ గత ఎన్నికల్లో ఇక్కడ 750 ఓట్లు మాత్రమే సాధించింది. జనసేన గత ఎన్నికల్లో బద్వేలును బీఎస్పీకి కేటాయించింది. దానికి వచ్చిన ఓట్లు 2,005. మొత్తం కలిపినా మూడు వేల ఓట్లు రాలేదు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి వస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఆయనను ఆహ్వానిస్తామని కూడా ఆయన అన్నారు.

ఆయన రాకుండానే….?

కానీ పవన్ కల్యాణ్ ప్రచారానికి రాకుండానే ఎన్నిక ముగిసింది. అయితే పవన్ కల్యాణ‌్ అభిప్రాయమేంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఏర్పడిన ఎన్నికతో పాటు ఆయన భార్యకు టిక్కెట్ ఇవ్వడంతో సంప్రదాయాన్ని అనుసరించి జనసేన పోటీ నుంచి తప్పుకుంది. ఇప్పుడు బీజేపీ పోటీలో ఉందని దానికి మద్దతుగా ప్రచారానికి వెళితే బాగుండదని పవన్ కల్యాణ్ బీజేపీ నేతలకు సూచించినట్లు తెలిసింది.

అదే కారణం…

అందుకే రాలేదని, కనీసం వీడియో సందేశాన్ని కూడా తాను పంపలేనని పవన్ కల్యాణ్ నిర్మొహమాటంటా పేర్కొన్నట్లు చెబుతున్నారు. బద్వేలులో బీజేపీ చెంత జనసేన జెండా కూడా ఎక్కడా కన్పించలేదు. ఆ పార్టీ క్యాడర్ కూడా బీజేపీికి మద్దతుగా పనిచేయలేదు. దీంతో జనసేన, బీజేపీల మధ్య బద్వేలు చిచ్చుపెట్టిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దీంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికలకు పవన్ కల్యాణ్ మద్దతు తెలపడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కల్యాణ‌్ చెప్పిన కారణాల్లో వాస్తవం లేకపోలేదని బీజేపీలో మరొకవర్గం అభిప్రాయపడుతుంది.

Tags:    

Similar News