Pawan kalyan : ఇద్దరూ కావాలట.. అందుకే ఆ ప్రయత్నాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇటు బీజేపీ కావాలి. అటు టీడీపీ కావాలి. రెండు పార్టీలతో పయనించాలన్నదే ఆయన ప్రయత్నంగా కన్పిస్తుంది. ఇటీవల విశాఖ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇటు బీజేపీ కావాలి. అటు టీడీపీ కావాలి. రెండు పార్టీలతో పయనించాలన్నదే ఆయన ప్రయత్నంగా కన్పిస్తుంది. ఇటీవల విశాఖ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇటు బీజేపీ కావాలి. అటు టీడీపీ కావాలి. రెండు పార్టీలతో పయనించాలన్నదే ఆయన ప్రయత్నంగా కన్పిస్తుంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం దీనికి అద్దం పడుతుంది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఒక్క మాట బీజేపీని అనలేదు. అదే సమయంలో టీడీపీ ప్రస్తావన తేలేదు.
వరసగా పొత్తులు….
పవన్ కల్యాణ్ ఇప్పటికే వరసగా పొత్తులు మార్చుకుంటూ వెళుతున్నారు. ఇది ఆయన క్రెడిబులిటీని ప్రశ్నిస్తుంది. రాజకీయాల్లో స్థిరత్వం లేని నేతగా పవన్ కల్యాణ్ ఇప్పటికే ముద్రపడ్డారు. మరోసారి పార్టీలను మార్చే ఉద్దేశ్యం ఆయనకు లేదనిపిస్తుంది. 2019 ఎన్నికల తర్వాత ఎవరి వత్తిడి లేకుండానే పవన్ కల్యాణ్ బేషరతుగా బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని ఎండగట్టిన పవన్ కల్యాణ‌్ వెనువెంటనే మనసు మార్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
బీజేపీతో తెగదెంపులకు…
మరోసారి పవన్ కల్యాణ్ పొత్తుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి బీజేపీని వీడటం పవన్ కు సుతారమూ ఇష్టంలేదు. దాని వల్ల రాజకీయంగా ఉపయోగం ఉండకపోగా, ఎన్నికల ముందు ఐటీ వంటి దాడులు జరుగుతాయన్న అనుమానాలు ఆయనలో లేకపోలేదు. అందుకే బీజేపీతో కలసి నడవడానికే ఆయన ఇష్టపడుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ మద్దతు కూడా పవన్ కల్యాణ్ కు అవసరం.
టీడీపీ అవసరం కూడా…
అందుకే బీజేపీ పెద్దలను ఒప్పించి ఎలాగైనా టీడీపీతో జట్టుకట్టే ప్రయత్నం పవన్ కల్యాణ‌్ చేస్తారన్నది పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తున్న టాక్. అందుకోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వైసీపీనే దోషిగా నిలబట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బీజేపీని, టీడీపీపై ఒక్క కామెంట్ కూడా చేయలేదు. దీంతో పవన్ కల్యాణ్ రెండు పార్టీలతో కలసి నడుద్దామన్న నిర్ణయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కల్యాణ్ ప్రయత్నాలకు బీజేపీ పెద్దలు ఏమాత్రం సహకరిస్తారన్నది చూడాల్సి ఉంది.