పవన్ వదిలించేసుకుంటున్నారా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి తో దోస్తీ తో పూర్తిగా రిలాక్స్ అయ్యేందుకేనా ? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం 2014 నుంచి పవన్ కళ్యాణ్ [more]

Update: 2020-01-15 02:00 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి తో దోస్తీ తో పూర్తిగా రిలాక్స్ అయ్యేందుకేనా ? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం 2014 నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ భారాన్ని మోస్తూ వస్తున్నారు. అయితే పార్ట్ టైం రాజకీయాలకే ఆయన పరిమితం కావడంతో గత ఎన్నికల ముందు వరకు ఆయన పెద్దగా ఇబ్బంది పడిన పరిస్థితి లేదు. కానీ 2019 ఎన్నికల్లో జనసేన అసలు సత్తా తేలిపోవడంతో పార్టీ ని ముందు ఉండి నడిపించడం ముఖ్యంగా ఆర్ధికంగా చాలా కష్టం తో కూడిన పనిగా మారింది. 18 మంది ఎమ్యెల్యేలు వున్నా పార్టీ ని నిర్వహించడం చిన్న విషయం కాదన్నది అర్ధం అయ్యే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారన్నది అందరికి తెలిసిందే.

అన్న బయటకు కొద్దిగా భిన్నంగా …

గతంలోనే జనసేన కు పార్టీని విలీనం చేయండని ఆఫర్ వచ్చింది. దీన్ని నిరాకరించిన జనసేనాని ఆ ఆఫ్ ది రికార్డ్ అంశాన్ని పబ్లిక్ లో పెట్టి బిజెపి ని తిట్టిపోసేవారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయాలు తాను తీసుకోనని స్పష్టం చేయడంతో కమ్యూనిస్ట్ లు ఆయనతో జత కట్టారు. పవన్ ఇమేజ్ తో ఒకటో రెండో సీట్లు సాధిద్దాం అనుకున్న వారి కల కూడా మొన్నటి ఎన్నికల్లో తిరగబడింది. సాక్షాత్తూ పవన్ రెండు చోట్లా ఓటమి పాలు కావడంతో బాటు పార్టీ కేవలం ఒకే ఒక సీటు దక్కడంతో కామ్రేడ్ లు ఎన్నికల తరువాత దూరం జరుగుతూ వచ్చారు.

అన్న బాటలోనే…

ప్రస్తుతం జనసేన బలపడటం అనే అంశం పక్కన పెట్టి కేంద్రంలోని అధికార పార్టీ అండ లేకపోతే ఉనికే లేకుండా పోతామని గుర్తించిన పవన్ కల్యాణ్ కమలంతో చెయ్యి కలిపే అడుగులు వేయాలని నిర్ణయించేశారు. ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలను కలిసి లైన్ క్లియర్ చేసేసారు. ఒక్క విలీనం అనే మాట తప్ప దాదాపు జనసేన కాషాయం లో కలిసిపోయినట్లే అంటున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ కూడా అన్న చిరంజీవి బాటలోనే దాదాపుగా వెళ్లక తప్పని పరిస్థితి రాజకీయ పరిణామాలు సృష్టించాయనే చెప్పొచ్చు.

Tags:    

Similar News