పవన్ ను అలా వాడుకుంటారటగ

రాజకీయాలపై పెద్దగా అవగాహన లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పూర్తి స్థాయిలో ఇక బిజెపి వాడేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సినీ స్టార్ కావడంతో పవన్ [more]

Update: 2020-01-17 06:30 GMT

రాజకీయాలపై పెద్దగా అవగాహన లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పూర్తి స్థాయిలో ఇక బిజెపి వాడేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సినీ స్టార్ కావడంతో పవన్ కల్యాణ్ సభలకు పైసా ఖర్చు లేకుండా ప్రజలు తరలివస్తారు. అలాగే ఆయన ఏం మాట్లాడినా దాన్ని అంతా వినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ పాయింట్ తోనే తమ పార్టీ ని తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమౌతున్నట్లు బిజెపి వైఖరి తొలి సమావేశంలోనే స్పష్టం అయ్యింది. పవన్ కల్యాణ్ తో ఏమి చెప్పించాలి ఏ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నది సిద్ధం చేసిన కమలం తన స్కూల్ స్టార్ట్ చేసినట్లే తేలిపోయింది.

సి ఎ ఎ కోసం చెప్పమన్న బిజెపి …

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ లో పౌరసత్వ సవరణ బిల్లుపై మైనారిటీ లు పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్రంలోని మోడీ నుంచి కింది స్థాయి వరకు ఎంత వివరణ ఇచ్చినా దాదాపు 10 రాష్ట్రాలకు పైగానే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు ఇంకా చల్లరనుకుడా లేదు. ఇలాంటి కీలక సున్నితమైన అంశం పై ఇరు రాష్ట్రాల్లో గట్టి ప్రచారం పవన్ కళ్యాణ్ చరిష్మా ను ఉపయోగించుకుని ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలన్నది కమలనాధుల ఆలోచన గా కనిపిస్తుంది.

కాషాయం శిక్షణలోనే…..

అందుకే బిజెపి – జనసేన కో ఆర్డినేషన్ తొలి భేటీలోనే పవన్ ఈ అంశాన్ని విస్మరించి మీడియా సమావేశం ముగించడానికి సిద్ధమైనప్పుడు కమలం నేతలు సిఎఎ మీద చెప్పాలని ఆయనకు సూచించారు. దీనిపై పవన్ కల్యాణ్ సుదీర్ఘ వివరణ ఇవ్వడం గమనార్హం. దేశానికి ముఖ్యంగా ఇతర దేశాల్లోని మైనారిటీలుగా ఉంటున్న హిందువుల రక్షణ కోసమే ఈ చట్టాన్ని మోడీ తెచ్చారని మైనారిటీలు తమ పౌరసత్వం రద్దు చేస్తారన్న అపోహ వదిలి వేయాలంటూ పవన్ కల్యాణ్ ముక్తాయింపు ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇకపై ఏమి మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనే అంశాలపై కాషాయం పార్టీ ఇచ్చే శిక్షణ లోనే నడుస్తుందని విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News