ప్రశ్నించే వారే లేరుగా
తనతో కలిసి అడుగులు వేసిన కామ్రేడ్స్ తో మాట మాత్రంగా కూడా చర్చించకుండా జనసేన అధినేత బిజెపి బాట పట్టేశారు. దాంతో బాటు ఏ అంశంపైన అయితే [more]
తనతో కలిసి అడుగులు వేసిన కామ్రేడ్స్ తో మాట మాత్రంగా కూడా చర్చించకుండా జనసేన అధినేత బిజెపి బాట పట్టేశారు. దాంతో బాటు ఏ అంశంపైన అయితే [more]
తనతో కలిసి అడుగులు వేసిన కామ్రేడ్స్ తో మాట మాత్రంగా కూడా చర్చించకుండా జనసేన అధినేత బిజెపి బాట పట్టేశారు. దాంతో బాటు ఏ అంశంపైన అయితే ఆయన బిజెపి కి దూరం అయ్యారో ఆ సమస్య కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ కాషాయం కి ఐ లవ్ యు చెప్పడం పెద్ద చర్చకే తెరతీసింది. ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన మాట తప్పారని తిరుపతి వెంకన్న సాక్షిగా అన్యాయం చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల ముందు గట్టి పోరాటమే చేసి దుమ్మెత్తిపోశారు. ఈ పాచిపోయిన లడ్డులు మాకెందుకు అంటూ కాకినాడ లో నిర్వహించిన సభలో చెలరేగిపోయారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ కి చంద్రబాబు అంగీకరించడమే నాడు అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. ముఖ్యంగా కేంద్రంలోని బిజెపి సర్కార్ తీరుపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు ఇంకా జనం మరచిపోలేదు.
పతనం చేసిన వారితోనే …
బిజెపి ఎపి లో పూర్తి మైనస్ లోకి వెళ్లిపోవడానికి విలన్ గా ప్రజలు చూడటానికి ప్రధాన పాత్ర టిడిపి వహించింది. అది పూర్తిగా నిజమే అంటూ పవన్ కళ్యాణ్ ప్రచారం హోరెత్తించడంతో ప్రజలు కమలాన్ని పాతాళానికి తొక్కేశారు. అప్పుడు ఎవరైతే తమకు ఈ గతి పట్టించడానికి కారకులు అయ్యారో వారి చేతే తిరిగి ప్రాణ ప్రతిష్ట చేయించే వ్యూహానికి బిజెపి శ్రీకారం చుట్టింది. దానికి జగన్ సర్కార్ విపక్షాలకు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో అల్లాడిపోతున్న వారు కమలం అండ అర్జెంట్ గా పవన్ కల్యాణ కు కావాలిసి వచ్చింది. వచ్చిన చక్కటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధం అయి బిజెపి సాయం కోసం చెయ్యి చాచిన పవన్ కళ్యాణ్ ను అక్కున చేర్చుకోవడానికి సై అనేసింది.
హోదా అంశం ఇక పూర్తిగా ….
టీడీపీ కేంద్రాన్ని ఎపి ప్రయోజనాలకోసం ప్రశ్నలు సంధించే స్థితిలో లేదు. పూర్తిగా తన ప్రాభవాన్ని కోల్పోవడం మోడీ ముందు గర్జించే సత్తా నేడు బాబు కి పార్లమెంట్ సీట్ల సంఖ్య రీత్యా లేకుండా పోయింది. ఈ స్థితిలో ఎపికి ప్రత్యేక హోదా అంశాన్ని తెలుగుదేశం మాట్లాడటం అయ్యే పనే కాదన్నది స్పష్టం. మరో పక్క అధికారంలో వున్న వైసిపి సైతం హోదా కోసం ఎన్నికల ముందు సుదీర్ఘ పోరాటం చేసినా బిజెపి కి కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉండటం కారణం గా వారిని బతిమాలాడటం తప్ప బెదిరించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సూటిగా చెప్పేశారు కూడా. ఇక పవన్ కల్యాణ‌్ మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల అనంతరం కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని కూడా జనసేనాని గట్టిగానే నిలదీసేవారు. ఎపి విభజన జరిగిన తీరును ఆయన తప్పుపడుతూ వచ్చారు. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ బిజెపి తో దోస్తీ సెట్ అయితే హోదా అంశం పై ప్రశ్నలు వేసే పార్టీలు కామ్రేడ్ లు మాత్రమే అవ్వనున్నారు.