టీడీపీ మునగాలి….. పవన్ కలవాలి
ఏపీ రాజకీయల్లో పై చేయి సాధించేందుకు బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఏపీలో బీజేపీ బలం పెంచుకునేందుకు పూర్తిగా ఫిరాయింపుల మీదనే దృష్టి సారించింది. ఈ విషయంలో [more]
ఏపీ రాజకీయల్లో పై చేయి సాధించేందుకు బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఏపీలో బీజేపీ బలం పెంచుకునేందుకు పూర్తిగా ఫిరాయింపుల మీదనే దృష్టి సారించింది. ఈ విషయంలో [more]
ఏపీ రాజకీయల్లో పై చేయి సాధించేందుకు బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఏపీలో బీజేపీ బలం పెంచుకునేందుకు పూర్తిగా ఫిరాయింపుల మీదనే దృష్టి సారించింది. ఈ విషయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలే వేరుగా ఉంటాయి. అస్సోం లాంటి చోట కాంగ్రెస్ ని పూర్తిగా సైడ్ చేసి అందులో నుంచి సీనియర్ నాయకులను పార్టీలో కలిపేసుకుని పటిష్టమైన బీజేపీ ఇపుడు అక్కడ అధికారంలోకి కూడా వచ్చేసింది. అదే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్యాడర్ ని పెంచుకుని పవర్ లోకి రావడం అంటే యుగాలు, జగాలు పడుతుంది. ఈ షార్ట్ కట్ మెదడ్స్ అమిత్ షాకు వెన్నతో పెట్టిన విధ్య. ఇపుడు ఏపీలో కూడా దీన్ని ఆయన పక్కాగా అమలు చేస్తున్నారని అంటున్నారు. అందుకే ఏపీలో టీడీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. దానికి పసుపు పార్టీ విఫల రాజకీయం కూడా బాగా సహకరిస్తోంది.
టీడీపీ ఎలిమినినేషన్….
గేమ్ లో ఒకరు ముందుకు రావాలంటే మరొకరు ఎలిమినేట్ కావాలి. ఇపుడు ఏపీలో బీజేపీ ఫోర్స్ గా ఎదగాలంటే టీడీపీ ప్రధాన రాజకీయ స్రవంతి నుంచి పక్కకు తప్పుకోవాలి. చంద్రబాబు అయితే అందుకు సుతరామూ ఒప్పుకోరు, కిందపడ్డా పై చేయి అని అంటారు. మళ్ళీ పొత్తులకు ఆయన చేతులు చాస్తున్నారు. ఆ విధంగా బీజేపీకి, జనసేనకు పదో పాతికో సీట్లు పడేసి తానే మరో మారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే అది పూర్తిగా అవుట్ డేటెడ్ పాలిటిక్స్ అని బీజేపీ కొట్టి పారేస్తోంది.
ఎంతకాలం ఒకరికింద…?
ఎంతకాలం మోచేతి నీళ్ళు తాగడం అంటోంది. ఇపుడు మేమే మేజర్ పార్టనర్ గా ఉంటాం, వైసీపీకి ఎదురు నిలబడతాం అంటోంది బీజేపీ. దానికి తగిన పూర్వ రంగాన్ని కూడా బీజేపీ సిధ్ధం చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్న మాటలు ఆ కోణం నుంచే చూడాలి. ఏపీ అసెంబ్లీలో మా ప్రాతినిధ్యం ఉంటుంది అని బీజేపీ అంటోంది అంటే టీడీపీలో చీలిక ఖాయమని చెప్పడమే. బాబు కాదన్నా కూడా ఈ పరిణామాలు ఆగేవి కావు, ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే జాతీయ పార్టీగా బీజేపీకి ఏపీలో స్పేస్ ఉండదు, అధికారంలో ఉన్న వైసీపీని ఇపుడే ఏమీ చేయలేరు. అందువల్ల మొదట బలి కావాల్సింది టీడీపీనే.
విలీనమే షరతు….
ఇక ఇటీవల కాలంలో జనసేనాని పవన్ మెత్తబడుతున్నారు. కమలనాధుల మీద ఆయన ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. దేశంలో మోడీ, అమిత్ షా అత్యంత శక్తిమంతులు అని కూడా పవన్ కీర్తిస్తున్నారు. ఈ విధంగా పవన్ బీజేపీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు. బీజేపీకి కూడా పవన్ చేరువ కావడం ఇష్టమే. అయితే ఈసారి పొత్తులు ఉండవు, ఏకంగా జనసేన బీజేపీలో విలీనం కావడమే. ఇదే షరతు మీద బీజేపీ పవన్ తో చర్చలు జరుపుతుందని అంటున్నారు. ఇది ఉభయతారకంగా ఉంటుందని కూడా కాషాయదళం అంటోంది. ఎందుకంటే పవన్ కి చరిష్మా ఉన్నా పార్టీ లేదు, క్యాడర్ కూడా లేదు.
పవన్ ఒప్పుకుంటే…?
అభిమానులు తప్ప, ఇక ఆయన కాపు సామాజికవర్గం నేత కావడం, సినీ గ్లామర్ ఉండడం వల్ల బీజేపీ లాంటి పార్టీలో చేరితే బాగుంటుందని అమిత్ షా లాంటి వారి ఆలోచన. ఇదేమీ కొత్త ప్రతిపాదన కూడా కాదు, తన పార్టీని కలిపేయమంటున్నారని చాలా సార్లు పవన్ బాహాటంగానే చెప్పారు. ఇపుడు ఎటూ పవన్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయారు. పార్టీకి కూడా ఒక్క సీటు తప్ప ఎక్కడా గెలుపు లేదు. దాంతో ఇపుడు పవన్ తమ ప్రతిపాదనను ఒప్పుకుంటారన్న ధీమా కమలనాధుల్లో ఉంది. అంటే టీడీపీని వానిష్ చేయడం, పవన్ని పార్టీలోకి లాగేయడం ద్వారా సర్వశక్తులు సమకూర్చుకుని ఏపీలో బీజేపీ జగన్ మీద బాణాలు ఎక్కుపెడుతుందన్నమాట. మరి చూడాలి అమిత్ షా వ్యూహాలకు ఎవరు బలి అవుతారో, మరెవరు విలవిల్లాడతారో.