లక్ష్యం కన్నబాబే ఎందుకంటే …?
డొక్కు స్కూటర్ మీద తిరిగే సామాన్య జర్నలిస్ట్ కురసాల కన్నబాబు కార్లలో తిరుగుతున్నాడు ఈ రోజు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యింది అంటే ఇలాంటి [more]
డొక్కు స్కూటర్ మీద తిరిగే సామాన్య జర్నలిస్ట్ కురసాల కన్నబాబు కార్లలో తిరుగుతున్నాడు ఈ రోజు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యింది అంటే ఇలాంటి [more]
డొక్కు స్కూటర్ మీద తిరిగే సామాన్య జర్నలిస్ట్ కురసాల కన్నబాబు కార్లలో తిరుగుతున్నాడు ఈ రోజు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యింది అంటే ఇలాంటి వారి నమ్మకద్రోహమే. అంటూ ఎన్నికల ముందు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ విరుచుకుపడి కన్నబాబు అంటే తనకు వున్న కడుపుమంట పబ్లిక్ గా బయటపెట్టేశారు. అక్కడితో ఆగలేదు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కన్నబాబు ఓటమికి ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ కూడా ప్రచారం నిర్వహించి దుమ్మెత్తిపోశారు పవన్ కల్యాణ్. ఇదంతా గమనించిన కన్నబాబు వెనక్కి తగ్గలేదు. మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ ఎదురుదాడికి దిగారు. తాను చిరంజీవికి తమ్ముడిని అయివుంటే బెంజ్ కారులో తిరిగేవాడినంటూ తనదైనశైలిలోనే విరుచుకుపడ్డారు. ఏపీలో గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వైసిపి అధినేత జగన్ తరువాత అంతగా టార్గెట్ చేసింది ఆ పార్టీలో కన్నబాబు ను మాత్రమే అన్నది అందరికి తెలిసిందే.
పవన్ అనుకున్నది ఒక్కటైతే …
పవన్ కళ్యాణ్ అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి. జనసేన అధినేత కన్నబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో జగన్ అలెర్ట్ అయ్యారు. కన్నబాబుకు అత్యధిక ప్రాధాన్యం పవన్ కల్యాణ్ వల్లే అనుకోకుండా పార్టీలో వచ్చిపడింది. ఎలాగైనా కురసాలను గెలిపించాలనుకోవడం తో బాటు వైసిపి కాకినాడ రూరల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు శ్రేణులను ఉత్సహపరిచింది. జగన్ అనుకున్నట్లే కన్నబాబు విజయం సాధించారు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. పవన్ కల్యాణ‌్ పంతం పట్టి ఓడిపోవాలని కోరుకున్న కన్నబాబుకి మరింత ప్రాధాన్యత కల్పించారు వైఎస్ జగన్. తన తొలి కేబినెట్ లో చోటు కల్పించడమే కాదు అత్యంత ప్రాధాన్యత గల వ్యవసాయశాఖ ను కట్టబెట్టారు. కురసాల అంత త్వరగా ఆ స్థాయికి చేరుకోవడంలో పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారణమనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ కూడా కావడం గమనార్హం.
పవన్ పై మాటల తూటాలు …
సామాన్య జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి రాజకీయంగా అత్యున్నత శిఖరాలకు చేరుకోవడం లో మెగాస్టార్ చిరంజీవి తొలిసారి పెట్టిన రాజకీయ భిక్షే కారణమని మంత్రి అయినవెంటనే కన్నబాబు వినమ్రంగా మీడియా ముందు ప్రకటించారు. వైఎస్ జగన్ నమ్మకంతో ఇచ్చిన బాధ్యత సక్రమంగా కొనసాగిస్తా అంటూ నాడు పేర్కొన్నారు. కట్ చేస్తే పవన్ కల్యాణ్ వైసిపి పై ఎప్పుడు విమర్శలు చేసినా ఆ పార్టీ నుంచి కన్నబాబు వెంటనే రియాక్ట్ అయ్యి పవర్ స్టార్ గాలి తీసే పనిలో వుంటున్నారు. ఇది పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు అయినప్పటికీ కన్నబాబు మాట్లాడే మాటలు జనసేన కు నేరుగా ముఖ్యంగా పవన్ కల్యాణ్ ని కలవరపెడుతున్నాయి. తాజాగా విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ పై కన్నబాబు విమర్శలు పవన్ కల్యాణ్ గట్టిగా చేశారు. టిడిపి దత్తపుత్రుడు 2014 నుంచి ఆ పార్టీతో లాంగ్ మార్చ్ చేస్తూనే ఉన్నాడంటూ వ్యంగ్యం గా వాగ్బాణాలు సంధించారు.
అందరిని వదిలి ఆ ఇద్దర్నే …
పవన్ విశాఖ సభలో వైసిపి పార్టీపై చేసిన విమర్శల్లో జగన్ తరువాత కన్నబాబు, విజయసాయి రెడ్డిలపై విరుచుకుపడ్డారు. అందులో కన్నబాబు ను ప్రత్యేకించి విమర్శించడం గమనార్హం. సామాన్యుడు కన్నబాబు స్థాయి మరిచి వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ను జనసేనను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, ఎమ్యెల్యే అంబటి రాంబాబు, రోజా వంటివారు ఘాటుగా విమర్శిస్తూ వస్తున్నారు. అయితే వీరిలో బొత్స పేరు ప్రస్తావించి విజయసాయి పై తన మాటల దాడి ని మరల్చారు పవన్ కల్యాణ్. మిగిలిన వారిని విడిచిపెట్టి కురసాల నే టార్గెట్ చేసుకున్నారు.
అసలు రీజన్ ఇదేనా …
వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి కన్నబాబు ను అంత వ్యక్తిగతంగా టార్గెట్ చేసే స్థాయి కాదు. కానీ చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడం వెనుక కొందరు ఆడిన మైండ్ గేమ్ తన అన్నయ్యపై పని చేసిందని పవన్ కల్యాణ్ నమ్ముతారని అంటారు. అందులో కన్నబాబు పాత్ర చాలావుందని పవన్ కల్యాణ్ కి ఆయన కోటరీ నూరిపోయడంతో అప్పటినుంచి కసిపెంచుకున్నట్లు టాక్. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కల్యాణ్ కి సుతరాము ఇష్టం లేదు. ఈ విషయంపై అన్నతో సైతం తమ్ముడు పవన్ విభేదించారు అంటారు. అలాగే పీఆర్పీ లో టికెట్ల అమ్మకం నాడు కొందరు జోరుగా వెనుక ఉండి నడిపించారని అందులో పైసా ఖర్చు లేకుండా చిరంజీవితో వున్న సాన్నిహిత్యం కన్నబాబుకు ఎమ్యెల్యే టికెట్ ఇప్పించిందని, అలాగే ఆ పార్టీలో గెలిచిన అతికొద్దిమందిలో కురసాల మెగా దయతో ఎమ్యెల్యే అయ్యి అన్నయ్యకు దెబ్బకొట్టారని బలంగా మనసులో పెట్టుకున్నట్లు ప్రచారాం నడుస్తుంది. వీటన్నిటితో బాటు జనసేన నెలకొల్పినప్పుడు నాడు అన్నయ్యతో నడిచినవారంతా తనవెంట ఉంటారని భావిస్తే వారే తన ప్రధాన ప్రత్యర్ధులు కావడాన్ని పవన్ కల్యాణ్ ఇప్పటికి జీర్ణించుకోలేకే బయట పడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా ఎలా వున్నా పవన్ కల్యాణ్ తో వైరం పెరిగేకొద్ది కురసాల అంతే స్థాయిలో వైసిపి లో ఎదుగుతూ ఉండటం రాజకీయాల్లో నెగిటివ్ పాజిటివ్ గా ఎలా మారుతుందో చాటిచెబుతుందని చూపుతున్నారు పొలిటికల్ పండితులు.