బ్రేకింగ్ : బాబుకు కౌంటర్ ఇచ్చిన పవన్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పవన్ టీడీపీతో కలిస్తే వైసీపీకి నష్టమేనని నిన్న చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి [more]

Update: 2019-01-02 09:40 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పవన్ టీడీపీతో కలిస్తే వైసీపీకి నష్టమేనని నిన్న చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ట్వీట్ ద్వారా సంపాదించారు. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని, సొంతంగానే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ట్వీట్ చేశారు. సొంతంగానే బలం చూపిద్దామంటూ ఆయన ట్వీట్ చేశారు. అదిగో పులి అంటే ఇదిగో తోక లాగా జనసేన ఆ పార్టీతో కలుస్తుంది… ఈ పార్టీతో కలుస్తుందని కొందరు అంటున్నారని, సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని చెబుతున్న వార్తల్లో నిజం లేదని పవన్ చెప్పారు.

Tags:    

Similar News