Pinnelli : ట్రాక్ రికార్డ్ అదుర్స్… మరి పదవి దక్కుతుందా?
పార్టీ అధినేత గుడ్ లుక్స్ లో పడాలంటే అందుకు ముఖ్యమైనది ప్రజాదరణ. ఆయన పనితీరుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్ [more]
పార్టీ అధినేత గుడ్ లుక్స్ లో పడాలంటే అందుకు ముఖ్యమైనది ప్రజాదరణ. ఆయన పనితీరుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్ [more]
పార్టీ అధినేత గుడ్ లుక్స్ లో పడాలంటే అందుకు ముఖ్యమైనది ప్రజాదరణ. ఆయన పనితీరుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. పెద్దగా హడావిడి కన్పించదు. నియోజకవర్గానికే పరిమితమైన నేత. మీడియాలో పెద్దగా కన్పించరు. తన పనేదో తాను చేసుకుపోతారు. అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పొలిటికల్ ట్రాక్ రికార్డు కూడా మామూలుగా లేదు.
అడ్డాగా చేసుకుని…
మాచర్ల నియోజకవర్గాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అడ్డాను చేసుకున్నారు. ఇక్కడ వరసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటుకున్నారు. ఇక ఇక్కడ టీడీపీ ఎన్ని వ్యూహాలను మార్చినా ఆయన గెలుపును అడ్డుకోలేకపోయింది. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ వరసగా నేతలను మార్చింది. యరపతినేని శ్రీనివాసరావు లాంటి నేతలను ఇన్ ఛార్జగా పంపింది. అయినా ఫలితం ఏకపక్షమే. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పక్షమే.
క్లీన్ స్వీప్ చేసి….
ఇక ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం రికార్డు సృష్టించింది. మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఐదు జడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకుంది. 71 ఎంపీటీసీల్లో 70 ఎంపీటీసలు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క ఎంపీటీసీకి జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం. ఇక్కడ వరస ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తున్న వైసీపీని విజయపథంతో నడిపింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే. జగన్ ను తొలి నుంచి నమ్ముకున్న వ్యక్తిగా ఆయన ముద్రపడిపోయారు.
అన్నింటినీ పక్కన పెట్టి…..
ఈసారి మంత్రివర్గంలో పల్నాడు ప్రాంతానికి చోటు ఉంటుందన్న లెక్కలు విన్పిస్తున్నాయి. సీనియర్ నేత, నమ్మకంగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈసారి మంత్రి పదవి ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి సామాజిక సమీకరణాలు కూడా పక్కన పెట్టి పిన్నెల్లికి జగన్ మంత్రి పదవి ఇస్తారన్న ఆశాభావంతో ఆయన అనుచరులు ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం మంచి ట్రాక్ రికార్డుతో జగన్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. మరి మంత్రి పదవి అనేది వస్తుందా? రాదా? అన్నది చూడాల్సి ఉంది.