పిన్నెల్లి పట్టు నుంచి బయటపడటం కష్టమేనా?

నాయ‌కులు ఒక‌టి త‌లిస్తే.. ప్రజ‌లు మ‌రొక‌టి త‌లుస్తూ ఉంటారు. అవి పార్టీలు ఏవైనా కావొచ్చు.. నాయ‌కులు ఎవ‌రైనా కావొచ్చు.. ప్రజ‌ల క‌రుణ‌‌తోనే పార్టీలు మ‌న‌గ‌లుగుతాయ‌నేది వాస్తవం. ఈ [more]

Update: 2020-05-18 12:30 GMT

నాయ‌కులు ఒక‌టి త‌లిస్తే.. ప్రజ‌లు మ‌రొక‌టి త‌లుస్తూ ఉంటారు. అవి పార్టీలు ఏవైనా కావొచ్చు.. నాయ‌కులు ఎవ‌రైనా కావొచ్చు.. ప్రజ‌ల క‌రుణ‌‌తోనే పార్టీలు మ‌న‌గ‌లుగుతాయ‌నేది వాస్తవం. ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. అధికారంలో ఉండ‌గా.. త‌మ‌కు ప‌ట్టులేని నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేయాల‌ని అనేక విధాల చేసిన ప్రయ‌త్నాలు, ధారాళంగా నిధులు కురిపించినా.. ఫ‌లించ‌ని వ్యూహాలు ఇప్పుడు టీడీపీని మ‌రోసారి వేద‌న‌కు గురి చేస్తున్నాయి. రాష్ట్ర రాజ‌ధాని గుంటూరు జిల్లాలో అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ప‌ట్టున్నప్పటి కీ.. ఓ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం పార్టీ ముందుకు దూసుకుపోలేక పోతోంది. అదే.. ప‌ల్నాడు ప్రాంతంలోని మాచ‌ర్ల. ఇక్క‌డ టీడీపీ చివ‌రి సారిగా 1999లో మాత్రమే గెలిచింది. ఆ త‌ర్వాత ఐదు ఎన్నిక‌ల్లో పార్టీ చిత్తుగా ఓడిపోతూ వ‌స్తోంది.

యరపతినేనికి అప్పగించినా…

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ పాగా వేయాల‌ని .. గ‌త ఐదేళ్ల టీడీపీ హ‌యాంలో అప్పటి సీఎం చంద్రబాబు, ఆయ‌న కుమారుడు, అప్పటి మంత్రి లోకేష్‌లు తీవ్రంగా ప్రయ‌త్నించారు. అనేక రూపాల్లో ఇక్క‌డ అభివృద్ధి ప‌నులు కూడా ప్రారంభించారు. ఇక్కడ వ‌రుస విజ‌యాలు సాధిస్తోన్న పిన్మెల్లి రామ‌కృష్ణారెడ్డికి చెక్ పెట్టేందుకు అప్పట్లో దూకుడుగా ఉన్న గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుకు చంద్రబాబుకు ప్రత్యేకంగా బాధ్యత‌లు అప్పగించారు. అప్పటి నుంచి య‌ర‌ప‌తినేని వ‌ర్సెస్ పిన్మెల్లి మ‌ధ్య తీవ్రమైన వాడీవేడీ మాట‌ల యుద్ధం న‌డిచింది. అయినా కూడా ఇక్కడ టీడీపీకి అనుకూల ప‌వ‌నాలు వీచింది లేదు.

అభ్యర్థిని మారుస్తుండటం..

మాచ‌ర్లపై చంద్రబాబుకు ఇంట్రస్ట్ లేదో ఏమోగాని ప్రతిసారి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చాక అప్పటిక‌ప్పుడు ఎవ‌రో ఒక‌రిని ఇక్కడ‌కు అభ్యర్థిని దిగుమ‌తి చేయ‌డం… స‌ద‌రు అభ్యర్థి చిత్తుగా ఓడిపోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇక గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అన్నపురెడ్డి అంజి రెడ్డి కూడా ఓట‌మిపాల‌య్యారు. నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు ముక్కూమొఖం తెలియ‌ని అంజిరెడ్డిని చివ‌ర్లో అభ్యర్థిగా ప్రక‌టించ‌గా అంజిరెడ్డి ఓడిపోయారు. 2009 నుంచి ఇప్పటి వ‌ర‌కు కూడా ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తున్నారు. 2004లో కూడా ఆయ‌న బాబాయి విజ‌యం సాధించారు.

ఓడిపోయిన వెంటనే…

ఇక ఎన్నిక‌ల్లో ఓడిన అంజిరెడ్డి వెంట‌నే త‌న వ్యాపారాల కోసం మాచ‌ర్ల నుంచి చెక్కేశారు. దీంతో అనాథ‌లా మారిన మాచ‌ర్ల టీడీపీని ఆదుకునేందుకు చంద్రబాబు మ‌ళ్లీ మాజీ ఇన్‌చార్జ్ చ‌ల‌మారెడ్డికే నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ప‌గ్గాలు అప్పగించారు. అస‌లు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ కేడ‌ర్‌కు ఆయ‌న‌పై న‌మ్మకం లేకే.. అభ్యర్థిని మార్చాల‌ని గొడ‌వ చేస్తేనే చంద్రబాబు అంజిరెడ్డికి సీటు ఇచ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే చ‌ల‌మారెడ్డికి పార్టీ ప‌గ్గాలు ఇవ్వడాన్ని బ‌ట్టి చూస్తే ఇక్కడ భ‌విష్య‌త్తులో ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప సైకిల్ చ‌క్రం తిర‌గ‌డం క‌ష్టమే అనిపిస్తోంది.

Tags:    

Similar News