మళ్లీ పీతల దిక్కయినట్లుందిగా…?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అదృష్టం కొన్ని సార్లు దోబూచులాడుతుంది. ఈ విషయం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతలపూడి నియోజకవర్గం మాజీ [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అదృష్టం కొన్ని సార్లు దోబూచులాడుతుంది. ఈ విషయం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతలపూడి నియోజకవర్గం మాజీ [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అదృష్టం కొన్ని సార్లు దోబూచులాడుతుంది. ఈ విషయం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతలపూడి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాత విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న పీతల సుజాత పరిస్థితి ప్రతి ఐదేళ్లకు ఒకసారి మారుతుండడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. 2004లో పార్టీ తరఫున టికెట్ తెచ్చుకుని పీతల సుజాత విజయం సాధించారు. అయితే, పార్టీ అధికారంలోకి రాలేదు. పార్టీ పట్ల నిబద్ధత విషయంలో పీతల సుజాత తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆమె ఆచంట రిజర్వ్‌డ్ సీటు నుంచి తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించారు.
సీటు రాకపోయినా….
పీతల సుజాత.. అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ల పట్ల ఎంతో వినయంతో ఉంటారనే పేరు కూడా తెచ్చుకున్నారు. ఇక, 2009లో ఆమె ప్రయత్నించినా.. అప్పటి సమీకరణల నేపథ్యంలో ఆమెకు టికెట్ లభించలేదు. అయినా కూడా పార్టీ గెలుపుకోసం ఆమె ప్రయత్నించారు. 2009లో ఆమెకు సీటు రాకపోయినా ఐదేళ్ల పాటు పార్టీ పట్ల ఎంతో విధేయతతో ఉన్నారు. ఇక, 2014 విషయానికి వస్తే.. చంద్రబాబు పిలిచి మరీ పీతల సుజాతకు టికెట్ ఇచ్చారు. ఈ దఫా చింతలపూడి నుంచి ఆమెకు టికెట్ ఇచ్చారు. చింతలపూడికి ఆమె నాన్‌లోకల్ అయినా కూడా మరోసారి పీతల సుజాత విజయం సాధించారు.
మరోసారి ఇవ్వకున్నా….
దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో పీతల సుజాతకు బాబు కేబినెట్‌లో మంత్రి పదవిని ఇచ్చారు. కీలకమైన గనుల శాఖను ఆమె చేతిలోనే పెట్టారు. అయితే, అంతర్గత కలహాలు, నియోజకవర్గంలో ఆధిపత్య ధోరణి.. సీనియర్ల దూకుడు వంటి రీజన్లతో ఆమె ఒకింత విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ తాజా ఎన్నికల్లో ఆమెకు చంద్రబాబు మొండి చేయి చూపించారు. కర్రా రాజారావుకు ఇక్కడ టికెట్ ఇచ్చారు. అయితే, వైసీపీని ధీటుగా ఎదుర్కొనలేక పోయారు. దాదాపు 36 వేల ఓట్ల తేడాతో విజయానికి దూరమయ్యారు. అయితే, అదే పీతల సుజాత అయితే.. ఓడిపోయినా.. ఏ పది వేల మార్జిన్‌తోనే ఉండేదనే టాక్ ఉంది.
మళ్లీ ఇన్ ఛార్జిగా….
ఇక, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. కానీ, కర్రా రాజారావు మాత్రం ఓడిపోయిన తర్వాత.. పార్టీకి దూరమయ్యారు. ఇక, పీతల సుజాత మాత్రం తనకు టికెట్ ఇవ్వక పోయినా.. పార్టీని మాత్రం వదిలి పెట్టలేదు. సీటు ఇవ్వకపోయినా ఆమె జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఇటీవల వరదలు వచ్చిన సమయంలో ఆ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు ఏ కార్యక్రమానికి పిలుపు నిచ్చినా.. తనవంతుగా పీతల సుజాత హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పీతల సుజాత సేవలను గమనించిన చంద్రబాబు, లోకేష్ కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్న నియజకవర్గాల కొత్త ఇంచార్జుల్లో పీతల సుజాత పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అదే జరిగితే….
రాష్ట్రంలో ఖాళీ అయిన ప్రత్తిపాడు, బాపట్ల, మాచర్ల, ధర్మవరం నియోజకవర్గాలతో పాటు చింతలపూడి లాంటి చోట్ల కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించనున్నారు. ఈ క్రమంలోనే చింతలపూడి పార్టీ పగ్గాలు మళ్లీ పీతల సుజాతకే ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. తనకున్న ఐదేళ్ల సెంటిమెంట్ మళ్లీ రిపీట్ చేసినట్లే అవుతుంది.