Janasena : డెడ్లీ కాంబినేషన్ అట…ఇడ్లీ, సాంబారు మాత్రం కాదట

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మూడేళ్ల ముందే మారుతున్నాయి. జగన్ ను ఓడించేందుకు జనసేన, టీడీపీ ఏకమవుతున్నాయి. కాపు, కమ్మ కాంబినేషన్ వర్క్ అవుట్ అవుతుందని తెలుగుదేశం [more]

Update: 2021-10-26 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మూడేళ్ల ముందే మారుతున్నాయి. జగన్ ను ఓడించేందుకు జనసేన, టీడీపీ ఏకమవుతున్నాయి. కాపు, కమ్మ కాంబినేషన్ వర్క్ అవుట్ అవుతుందని తెలుగుదేశం అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. డెడ్లీ కాంబినేషన్ గా చెబుతోంది. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలసి పోటీ చేస్తే జగన్ ఖచ్చితంగా ఓడిపోతారని జోస్యాలు చెబుతుంది. బలమైన రెండు సామాజికవర్గాలను కలవనివ్వకుండా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడా ముందు జాగ్రత్తగా అనుకూల మీడియా ప్రచారానికి దిగుతుంది.

కానీ కష్టమే…

ఆంధ్రప్రదేశ్ ను నిశితంగా పరిశీలించిన వారికి మాత్రం ఈ కమ్మ, కాపు కాంబినేషన్ వర్క్ అవుట్ అవుతుందని చెప్పలేం. ఇప్పటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాని, విభజిత ఏపీనిగాని కమ్మ, రెడ్లు మాత్రమే పాలన చేశారు. కాపుల నుంచి ముఖ్యమంత్రులు కాలేకపోయారు. కమ్మ, రెడ్డికి కాకుండా మూడో కులానికి అధికారాన్ని అప్పగించేందుకు కమ్మలు సిద్ధంగా ఉండరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయినప్పటికీ కాపుల డామినేషన్ ఉంటుందన్నది వారి భయం.

ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు….

మరో వైపు కాపులు కూడా కమ్మల ఆధిపత్యాన్ని అంగీకరించరు. కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు కులాలు కలసినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. స్థానిక పరిస్థితులను బట్టి కాపులు పార్టీల వైపు మొగ్గు చూపుతుంటారు. తమ ప్రాంతంలో పోటీ చేసిన అభ్యర్థుల ను బేరీజు వేసుకుని వాళ్లు స్టాండ్ తీసుకుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. కాపులలో ఎక్కువ శాతం వైసీపీీ వైపు నిలవడంతో గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు.

పవన్ వైపు…?

మరో వైపు పవన్ కల్యాణ్ ను కూడా కాపు సామాజికవర్గం నమ్మలేని పరిస్థితి ఉంది. అలాగే గ్రామాల్లో కాపులు, కమ్మలు రెండు గ్రూపులుగా అనేక సంవత్సరాలుగా విడిపోయి ఉన్నారు. కొన్ని గ్రామాల్లో కమ్మల ఆధిపత్యం ఉండగా, మరికొన్నింటిలో కాపుల డామినేషన్ ఉంది. ఈ రెండు వర్గాలు ఒక్కటయితే మిగిలిన సామాజిక వర్గాలు ఏకమయ్యే అవకాశముంది. ఇప్పటికీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు, కమ్మల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతుంది. రెండు ఎన్నికల్లో ఆ ప్రభావం కన్పించింది. మరి ఈ డెడ్లీ కాంబినేషన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి.

Tags:    

Similar News