రివేంజ్ రేంజ్ మారిపోయింది
రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావుండదనేది నిన్నటి మాట. కానీ, నేడు పరిస్థితి అలా లేదు. ఎక్కడికక్కడ నాయకులు వ్యక్తిగత విమర్శలకు, ప్రతీకారాలకు దిగుతున్నారు. గత ఏడాది జరిగిన [more]
రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావుండదనేది నిన్నటి మాట. కానీ, నేడు పరిస్థితి అలా లేదు. ఎక్కడికక్కడ నాయకులు వ్యక్తిగత విమర్శలకు, ప్రతీకారాలకు దిగుతున్నారు. గత ఏడాది జరిగిన [more]
రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావుండదనేది నిన్నటి మాట. కానీ, నేడు పరిస్థితి అలా లేదు. ఎక్కడికక్కడ నాయకులు వ్యక్తిగత విమర్శలకు, ప్రతీకారాలకు దిగుతున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. సరే! ఇంతటితో విషయం అయిపోయిందని అనుకుంటే.. తమిళనాడు తరహా రాజకీయ సంస్కృతి ఇప్పుడు ఏపీలో చోటు చేసుకుంది. అంటే. కేవలం ఎన్నికల సమయంలోనే వ్యక్తిగత విమర్శలు కాకుండా.. అధికారంలోకి వచ్చిన పార్టీ అధికారం కోల్పోయిన పార్టీని సమూలంగా దెబ్బతీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం.
టీడీపీ నేతలే టార్గెట్ గా…
ఇప్పుడు ఈ మాట .. టీడీపీ నుంచి చాలా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఎక్కడికక్కడ తమ నాయకులను అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తోంది. ఎన్నికలు జరిగిన నాలుగు మాసాల్లోనే వైసీపీ టీడీపీని ఇరకాటంలోకి నెట్టిందని ఆ నాయకులు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ నాయకులే టార్గెట్గా ప్రభుత్వం వారి వారి వ్యాపారాలపై దాడులు చేయిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తు న్నారు. గడిచిన రెండు వారాలుగా పరిస్థితికూడా అలానే ఉండడం గమనార్హం.
గ్రానైట్ కంపెనీలపై…..
గ్రానైట్ కంపెనీలకు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలకు చెందిన కంపెనీలపై రాష్ట్ర గనుల శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. 2015లో తీసుకున్న అనుమతులు, ప్రస్తుతం సాగిన వ్యాపారం, ఎగుమతులు వంటిపలు అంశాలపై వారు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే సిద్దా రాఘవరావులకు ఉన్న గ్రానైట్ గనుల కార్యాలయాలపై రాష్ట్ర అధికారులు దాడులు చేసి వందల కోట్లలో జరిమానాలు విధించారు. భారీ అవక తవకలకు పాల్పడ్డారని వారు తమ నివేదికలో పేర్కొన్నారు.
ఉద్దేశ్యపూర్వకంగానే…..
అదేవిధంగా పలువురు టీడీపీ నాయకులకు కూడా ఈవిధంగానే జరిమానా విధించారు. ఇక, బీజేపీ ఎంపీ గరికిపాటి రామ్మోహన్‌రావుకు చెందిన క్వారీపైనా దాడులు చేశారు. దీంతో ఇదంతా కూడా జగన్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా తమపై దాడులు చేయిస్తోందని ఆయా నాయకులతో పాటు టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఈ పరిణామం ఎటు దారితీస్తుందో చూడాలి.