ఆ లీడ‌ర్ పార్టీకి దూర‌మే

రాజ‌కీయాల్లో ఒక్క ఓట‌మితో నాయ‌కులు తీసుకునే నిర్ణయాలు కూడా అంతే సంచ‌ల‌నంగా ఉంటాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కీల‌క నాయ‌కుడు, కొండేపి, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల [more]

Update: 2019-11-20 02:00 GMT

రాజ‌కీయాల్లో ఒక్క ఓట‌మితో నాయ‌కులు తీసుకునే నిర్ణయాలు కూడా అంతే సంచ‌ల‌నంగా ఉంటాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కీల‌క నాయ‌కుడు, కొండేపి, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దాదు పు రెండు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న పోతుల రామారావు ఇప్పుడు మ‌రోసారి రాజ‌కీయంగా సెంట‌రాఫ్‌ది టాపిక్‌గా మారిపోయారు. మ‌రి ఆయ‌న‌కు ఏమైంది? ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో రేగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్ పార్టీతో రాజ‌కీయ ప్రస్థానం ప్రారంభించిన పోతుల రామారావు త‌ర్వాత ఇదే పార్టీ నుంచి కొండేపి నియోజ‌కవ‌ర్గంలో 2004లో పోటీ చేసి విజ‌యం సాధించారు.

వైసీపీలో చేరి….

అయితే, 2009 ఎన్నిక‌ల‌కి వ‌చ్చే స‌రికి కొండేపి నియోజ‌క‌వ‌ర్గం రిజ‌ర్వ్ గా మారిపోయింది. దీంతో పోతుల ఇక్కడ నుంచి త‌ప్పు కోవాల్సి వ‌చ్చింది., ఈ క్రమంలోనే ఆయ‌నకు వైఎస్ ద‌య‌తో ఎమ్మెల్సీ సీటు వ‌రించింది. అలా కొన‌సాగిన పోతుల రామారావు రాష్ట్ర విభ‌జ‌న‌, కాంగ్రెస్‌పై ప్రజ‌లు పెంచుకున్న వ్యతిరేక‌త నేప‌థ్యంలో పోతుల రామారావు 2014 ఎన్నిక‌ల‌కుముందు కాంగ్రెస్‌కు బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నిక‌ల‌లో వైసీపీ త‌ర‌ఫున కందుకూరులో పోటీ చేసి విజ‌యం సాధించారు.

ఓటమి తర్వాత…..

అయితే, ఈ పార్టీ అప్పట్లో అధికారంలోకి రాక‌పోవ‌డంతో ఆ వెంట‌నే ఆయ‌న టీడీపీలోకి జంప్ చేశారు. ఈ పార్టీలోనే నిన్నమొన్నటి వ‌ర‌కు ఇప్పుడు కూడా కొన‌సాగుతున్నారు. కందుకూరులో పోతుల రామారావుకు మాజీ ఎమ్మెల్యే దివి శివ‌రాం వ‌ర్గాల‌కు ఏ మాత్రం పొస‌గ‌లేదు. పైగా నియోజ‌క‌వ‌ర్గానికి నాన్ లోక‌ల్ అయిన త‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు అక్కడ పెత్తనం ఇవ్వడం కూడా కందుకూరు వాసుల‌కు రుచించ‌లేదు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి టీడీపీ వైపు కూడా ఆయ‌న క‌న్నెత్తి చూడ‌డం మానేశారు.

దివిచేతిలోనే పగ్గాలు….

నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పోతుల రామారావు పాల్గొనడం లేదు. ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పలు అంశాలపై నిరసనలు, ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇసుక లభ్యత లేకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు నిరసనలు వ్యక్తం చేశారు. ఏ పిలుపుకూ పోతుల రామారావు స్పందించలేదు. ఆయా సందర్భాల్లో నియోజకవర్గ కేంద్రానికి రావడం కాని, ఏదో ఒకటి చేయడం కాని జరగడం లేదు. దీనికి తోడు మండల కేంద్రమైన ఉలవపాడులో సుమారు నెల రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మండల సమావేశానికి పోతుల రామారావు వెళ్ళలేదు. ఇక అదే టైంలో కందుకూరులో మ‌ళ్లీ దివి శివ‌రాం కేడ‌ర్‌కు అందుబాటులో ఉంటూ ప‌ట్టు సాధిస్తున్నారు. దీంతో కందుకూరు రాజ‌కీయాల్లో మ‌ళ్లీ దివి హ‌వా స్టార్ట్ అయిన‌ట్టే అంటున్నారు. ఈ లెక్కన చూస్తే పోతుల రామారావు ఇక‌, పార్టీకి దూర‌మ‌వుతున్నారా? అనే సందేహం పార్టీలో వ్యక్తమవుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News