పీకే వ్యూహం ఇక్కడ ఫలిస్తుందా?

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంది. అన్నాడీఎంకే, డీఎంకే లు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. ఇక ప్రభావం చూపే [more]

Update: 2020-11-04 16:30 GMT

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంది. అన్నాడీఎంకే, డీఎంకే లు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. ఇక ప్రభావం చూపే మక్కల్ నీది మయ్యమ్ తో కమల్ హాసన్ దూకుడు మీద ఉన్నారు. విజయకాంత్ డీఎండీకే కూడా గణనీయమైన ఓట్ల శాతాన్ని సాధిస్తుంది. మరోవైపు రజనీకాంత్ పార్టీ కూడా ఎన్నికలకు ముందుగానే వచ్చేస్తుందంటున్నారు. ఇన్ని పార్టీల మధ్య డీఎంకే విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఎలా ఉండనుందోనన్న చర్చ మొదలయింది.

ఏపీ, ఢిల్లీలలో విజయం తర్వాత…

ప్రశాంత్ కిషోర్ ఏపీలో వైసీపీని ఒంటిచేత్తో గెలించారు. 151 సీట్లు వైసీపీ గెలుచుకోవడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహమే ఎక్కువగా ఉంది. ఇప్పటికి విపక్ష టీడీపీ ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఇక ఢిల్లీ ఎన్నికల్లోనూ అరవింద్ కేజ్రీవాల్ కు రెండోసారి ఘన విజయాన్ని సాధించిపెట్టారు. కేజ్రీవాల్ నాయకత్వంపై నమ్మకం కొంత మేర పనిచేసినా అక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహమే పనిచేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అంగీకరించింది.

అంత ఈజీ కాదట…..

అయితే ఇప్పుడు తమిళనాట డీఎంకే ను గెలిపించడం ప్రశాంత్ కిషోర్ కు అంత సులువు కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ పెద్దగా బలంగా లేకపోయినా ప్రాంతీయ పార్టీలు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును అన్ని ప్రాంతీయ పార్టీలు చీల్చుకుంటే డీఎంకే కు లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

వరస సర్వేలతో…..

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం తమిళనాడులో సర్వేలు చేసింది. ఎక్కువ స్థానాలను డీఎంకే తీసుకోవాలని పార్టీకి సూచించింది. కూటమిలోని పార్టీలకు తక్కువ స్థానాలను కేటాయించాలని తెలిపింది. అభ్యర్థుల విషయంలోనూ స్పష్టమైన జాబితాను ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ టీం రెడీ అయింది. దీంతో పాటు డీఎంకే బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి స్టాలిన్ కు నివేదిక ఇచ్చింది. అయినా సరే ఎక్కడో డౌటు. డీఎంకే బలంగా ఉన్నప్పటికీ ఎన్నికల సమయానికి ఓటరు తీరు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు. మరి స్టాలిన్ మాత్రం ప్రశాంత్ కిషోర్ పైనే నమ్మకం పెట్టుకున్నారు.

Tags:    

Similar News