పీవీ కుటుంబానికి మోడీ ఆశీస్సులు ?

అంధ్ర ప్రదేశ్ రాజకీయాల మీద ప్రధాని మోడీ దృష్టి సారించారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయి. ఏపీకి సంబంధించి బీజేపీ గతంలో ఎన్నడూ లేని [more]

Update: 2020-04-29 14:30 GMT

అంధ్ర ప్రదేశ్ రాజకీయాల మీద ప్రధాని మోడీ దృష్టి సారించారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయి. ఏపీకి సంబంధించి బీజేపీ గతంలో ఎన్నడూ లేని ప్రయోగాన్ని చేసింది. అది ఎన్నికల అవసరాలు, ఇతర సామాజిక వర్గ సమీకరణ కోసం చేసి ఉండవచ్చు కనీ దాని వల్ల పెద్దగా లాభం లేదని, పైగా పార్టీ నైతికత కూడా దెబ్బ తింటోందని హై కమాండ్ కి అర్ధమయ్యేసరికి పుణ్యకాలం గడచి పోయింది. ఇదిలా ఉండగా ఏపీలో బీజేపీకి ప్రాణం పోసి పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టిన సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు పట్ల ప్రధాని మోడీ తరచూ చాటుకుంటున్న అభిమానం. గురుభావం చూసిన తరువాత ఏపీలో బీజేపీ దశ,దిశను మార్చేందుకు సరికొత్త ప్రయోగాన్ని చేస్తున్నట్లుగా అర్ధమవుతోంది.

అలా వెనకబడినా…

నిజానికి ఉమ్మడి ఏపీ బీజేపీలో వరిష్ట నేతగా పీవీ చలపతిరావు గుర్తింపు పొందారు. ఆయన మూడు సార్లు ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ బీజీపీకి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించడమే కాకుండా వెంకయ్యనాయుడుతో సహా అనేకమంది నేతలను తీర్చిదిద్దారు. ఆయన వాజ్ పేయి కాలం నాటివారు. అయితే వాజ్ పేయి ప్రధాని కాగానే అప్పట్లో ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారని అనుకున్నా పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయం మూలంగా కొందరు అడ్డుకున్నారు. ఆయనకు జాతీయ స్థాయి నేతలతో పరిచయాలు ఉన్నా ఎవరూ పెద్దగా గుర్తించి ఆదరించినది లేదు. అటువంటి పీవీని మాత్రం మోడీ బాగా గుర్తుపెట్టుకుంటున్నారు.

గురుభక్తితో….

పీవీ పట్ల నరేంద్ర మోడీ గురు భక్తిని చూపిస్తున్నారు. ఆయన గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విశాఖ బీజేపీ నేతలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీని ప్రత్యేకంగా పలకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇపుడు మరోమారు పీవీకి స్వయంగా ఆయన ఫోన్ చేసి మరీ కుశల ప్రశ్నలు అడిగారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అయిదు నిముషాల సేపు ప్రధాని మోడీ పీవీతో ముచ్చటించడం విశాఖ బీజేపీనే కాదు, ఏపీ బీజేపీ నేతలనే ఆశ్చర్యపరుస్తోంది.

ఆయనేనా…?

ఇక పీవీ కుమారుడు పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. తండ్రి మాదిరిగానే ఆయన కూడా పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నారు. అదే విధంగా పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు. దాంతో ఆయనకు బీజేపీ ఏపీ పీఠం దక్కవచ్చునని కొంతకాలంగా ప్రచారంలో ఉంది ఎటూ కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం వివాదం కావడంతో పాటు, ఆయన సేవలు వద్దు అనుకుంటున్న బీజేపీ పెద్దలు యువ నేత, పీవీ కుటుంబం నుంచి వచ్చిన మాధవ్ కి పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు. బీసీ నేత కావడం, వెనకబడిన ఉత్తరాంధ్రాకు ప్రాతినిధ్యం వహించడం వంటి కారణాలతో మాధవ్ కే ఈ కీలక పదవి ఇస్తారంటున్నారు. ఇపుడు మోడీ స్వయంగా పీవీ కుటుంబాన్ని సమాదరిస్తున్న తీరుని చూసిన వారికి ఆయన ఆశీస్సులు తప్పకుండా ఉన్నాయని, రేపో మాపో మాధవుడే బీజేపీ రధ సారధి అంటున్నారు.

Tags:    

Similar News