మనసు దోచేశావే

కమలం దక్షిణాది పై గట్టిగానే కన్నేసింది. హిందీ బెల్ట్ లో ప్రస్తుతం బిజెపి కి తిరుగులేదు. దక్షిణాదిలో మాత్రం చాలా బలహీనంగా వుంది కాషాయం పార్టీ. ఒక్క [more]

Update: 2019-10-12 16:30 GMT

కమలం దక్షిణాది పై గట్టిగానే కన్నేసింది. హిందీ బెల్ట్ లో ప్రస్తుతం బిజెపి కి తిరుగులేదు. దక్షిణాదిలో మాత్రం చాలా బలహీనంగా వుంది కాషాయం పార్టీ. ఒక్క కర్ణాటక తప్ప తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో బిజెపి ఎదుగుదల ప్రశ్నార్థకంగానే వుంది. ఈ నేపథ్యంలో రెండోసారి ప్రధాని అయ్యాక ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయం ఇక పూర్తి స్థాయిలో అశ్వమేధ యాగం మొదలు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందులోభాగంగా దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో ప్రధాని కార్యక్రమాలు నెమ్మదిగా జోరు అందుకున్నాయి. అదీ కూడా డిఫరెంట్ గా అవి ప్లాన్ చేస్తున్నారు వ్యూహకర్తలు.

చెన్నై నుంచి మొదలు పెట్టి …

ఇటీవలే చెన్నై ఐఐటి లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దానికి ముందు హిందీ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో తమిళులు భగ్గుమన్న వాతావరణం అది. ఆ సమయంలో ఆయన పర్యటన సాగింది. దేశంలో కానీ విదేశాల్లో సైతం హిందీలోనే ప్రసంగించే ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై లో మాత్రం ఆంగ్లంలో మాట్లాడి తంబిల మనసు దోచుకునే తొలి ప్రయత్నం విజయవంతంగా చేశారు.

సంప్రదాయ దుస్తులతో…..

ఆ తరువాత తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మహాబలిపురం పర్యటనలో తమిళ సంప్రదాయ దుస్తులు ధరించి మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసి విజయవంతం అయ్యారు. తమ ఆచార సంప్రదాయాలు, కట్టుబొట్టుల కోసం తమిళీయులు చేసే పోరాటం , ఆరాటం దేశవాసులందరికి సుపరిచితమే. అందుకే ప్రధాని మోడీ అటునుంచి వారి మనసులు దోచుకునేందుకు ఒక ప్రయత్నం మొదలు పెట్టారు. ఇలాంటి చర్యలతో తమిళనాట బిజెపి మైలేజ్ ఏ మేరకు పెరుగుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News