ట్రిబుల్ “ఆ” లపై ప్రధాని కసరత్తు … మినహాయింపులు ఇస్తూ?

అందరికి ఆరోగ్యం … అందరికి ఆహారం … ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడం. ఇదే ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై ఉన్న భారం. కరోనా [more]

Update: 2020-04-13 05:00 GMT

అందరికి ఆరోగ్యం … అందరికి ఆహారం … ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడం. ఇదే ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై ఉన్న భారం. కరోనా దెబ్బతో ఆరోగ్యం, ఆహారం, ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ మూడింటి ని సమన్వయం చేసుకోకపోతే లాక్ డౌన్ తరువాత భారత్ ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత లాక్ డౌన్ పొడిగింపు అమలు చేసే నిర్ణయం తీసుకునేముందు స్మార్ట్ లాక్ డౌన్ అనే విధానమే ప్రస్తుతం దేశానికి శ్రీరామరక్ష అని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేశంలోని వివిధ వర్గాలను, ముఖ్యమంత్రులను సంప్రదించిన ప్రధాని త్రిబుల్ ఆర్ రూట్ మ్యాప్ ను ఫైనల్ చేసే పనిలో తలమునకలయ్యారు.

నీట ముంచినా …

మోడీ సర్కార్ ముందు ఇప్పుడు పెద్ద సవాల్ ఉంది. ఆయన ఇప్పుడు నీట ముంచినా లేదా పాల ముంచినా కేంద్రం అనుసరించే వ్యూహం పైనే ఆధారపడింది. దాంతో లాక్ డౌన్ ఇదే స్థాయిలో కొనసాగిస్తే మాత్రం దేశ ఆర్ధిక రంగం ఘోరంగా ఉంది. కరోనాకు ముందే దేశ ఆర్ధిక స్థితి సక్రమంగా లేదు. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడిన విధంగా కరోనా ఎఫెక్ట్ వచ్చింది. దీన్ని ఎదుర్కోవాలి దేశ ప్రజల ప్రాణాలు రక్షించాలి. ఆర్ధిక రంగం కుదేలు కాకుండా చూసుకోవాలి.

మినహాయింపులు ఇస్తూ…..

పేదలకు ఆహార కొరత లేకుండా చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాలి. దాంతో మోడీ ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ లాక్ డౌన్ పొడిగింపుపై ఆంక్షలు సడలించక తప్పని పరిస్థితి కేంద్రానికి ఏర్పాడింది. ఈ నేపథ్యంలో ఈ మూడింటిపై ప్రభావం పడకుండా ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. దేశాన్ని మూడు జోన్లుగా విభజించి లాక్ డౌన్ లో మినహాయింపులు ఇవ్వాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. దీంతో ప్రధాని వైపే దేశవాసుల చూపు నిలిచింది.

Tags:    

Similar News