కరోనాను అడ్డుపెట్టి ప్రజారవాణాకు తూట్లు ….?

కరోనా ప్రభావంతో ప్రజలు ఆరోగ్యాలే కాదు, ఆర్ధికంగా బాగా చితికిపోయారు. ఈ నేపథ్యంలో దయతలచి వారిని ఆదుకోవాలిసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ప్రజా [more]

Update: 2020-10-20 17:30 GMT

కరోనా ప్రభావంతో ప్రజలు ఆరోగ్యాలే కాదు, ఆర్ధికంగా బాగా చితికిపోయారు. ఈ నేపథ్యంలో దయతలచి వారిని ఆదుకోవాలిసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ప్రజా రవాణా అంశంలో కేంద్ర సర్కార్ రైల్వే లతో, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ లతో ప్రజలను బాదేస్తున్నారు. ఇప్పటికి రైల్వే వ్యవస్థ గాడిన పడలేదు. అన్ని ప్రత్యేక రైళ్ళే. ఎసి టికెట్ల ధరలు విమాన ధరలతో సమానంగా సాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ లు అయితే తమ మధ్య అంతరాష్ట్ర రవాణా సర్వీసులపై వివాదం పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాయి. ఫలితంగా ప్రెవేట్ బస్సులను అధిక ధరలకు ప్రజలు ఆశ్రయించాలిసి వస్తుంది.

సొంత వాహనాలనే …

కరోనా వచ్చిన నాటినుంచి అంతా సొంత వాహనాలపైనే ప్రయాణాల విషయంలో ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల ఖర్చు వారికి భారీగానే అవుతుంది. ఇక సామాన్యులు మాత్రం అత్యవసర ప్రయాణాలకు రైల్వే, బస్సులపైనే ఆధారపడాలిసి వస్తుంది. వారి జేబులకు మరింత చిల్లు పెడుతున్నాయి ఈ ప్రజారవాణా వ్యవస్థలు. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు, బస్సులతో సమానంగా కొద్దిగా అటు ఇటులో విమాన ప్రయాణ ధరలే కొంత తక్కువన్న అభిప్రాయం ప్రయాణికుల్లో ఉంది.

పరిమిత సంఖ్యలోనే…..

రైళ్లు, బస్సులు లేకపోవడంతో ప్రజా రవాణా వ్యవస్థ అనేక రాష్ట్రాల్లో మెరుగుపడలేదు. ప్రజావసరాలకు తగిన విధంగా వాహనాలను నడపటం లేదు. కోవిడ్ నిబంధలను పాటించాల్సి ఉండటంతో పరిమిత సంఖ్యలో బస్సులను, రైళ్లను నడుపుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అన్ లాక్ ప్రక్రియలో సినిమా థియేటర్లు, జిమ్ లకు సైతం అనుమతి ఇచ్చిన కేంద్రం తక్షణం ప్రయాణికులకు అందుబాటులోకి సాధారణ రైళ్ళు, బస్సులు నడిచేలా చర్యలు ఇప్పటికైనా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News